ఏపీ సీఎం జగన్మోహన్‌రెడ్డి ఆరు నెలల పాలన కంప్లీట్ చేసుకోబోతున్నాడు. ఈ క్రమంలోనే జగన్ చేపట్టిన సంస్కరణలు చాలా వరకు విజయవంతం అవుతూ ఉన్నాయి. ఎన్నో సంక్షేమ పథకాతో పాటు గ్రామ సచివాలయం లాంటి విప్లవాత్మక సంస్కరణలతో జగన్ దూసుకు పోతున్నారు. ఇదిలా ఉంటే ఒక్క ఇసుక కొరత విషయంలో మాత్రమే జగన్‌పై వ్యతిరేకత ఉన్న మాట నిజం. ఇందుకు ప్రభుత్వ విధానాలు కొంత కారణం అయితే… అదే టైంలో విపరీతమైన వరదల కారణంగా ఇసుక లభ్యత కూడా తక్కువగానే ఉంది.
ఇక రేపో మాపో ఇసుక కొరత తీరనుంది. ఇప్పటికే ప్రభుత్వం ఇసుక కొరత లేకుండా చేసేందుకు ఎక్కడికక్కడ స్టాక్ పాయింట్లకు కూడా పూర్తిగా అనుమతులు ఇస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పుడు కొరత తీరిపోతే సిమెంట్ కొరత ఏర్పడడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఇసుక కొరత నేపథ్యంలో సిమెంటు కంపెనీలు అన్నీ చాలా వరకు తమ ఉత్పత్తులు ఆపేశాయి. చాలా సిమెంట్ కంపీనీలు ఇసుక కొరతతో పాటు ఆర్ధిక మాంద్యం నేపధ్యలో ఉత్పత్తిని తమకు తాముగా తగ్గించుకున్నాయి.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్లో సిమెంట్ సరఫరా ఒక్కసారిగా పడిపోయింది. ఇసుక పూర్తిగా అందుబాటులోకి వచ్చి ఒక్కసారిగా ఏపీలో భవన నిర్మణాలు ఊపందుకుంటే ఇప్పుడు మళ్లీ సిమెంట్‌కు డిమాండ్ పెరుగుతుంది. ఈ విషయంలో మళ్లీ నిర్మాణాలు మందగిస్తే ఇప్పటికే ఇసుక విషయంలో జగన్‌పై ఉన్న వ్యతిరేకత కాస్తా ఇప్పుడు మరింత ఎక్కువ అవుతుంది.
ఈ ప్రమాదం లేకుండా ఉండాలంటే జగన్ సిమెంటు సరఫరా విషయంలో ఇప్పటి నుంచే తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. జగన్ సిమెంట్ పరిస్థితిని నియంత్రించకపోతే మళ్లీ పవన్, చంద్రబాబు సిమెంట్ కొరత అంటూ నానా హడావిడి చేస్తారనడంలో సందేహం లేదు. పైగా జగన్‌కు భారతి సిమెంట్స్ కంపెనీలు ఉండడం కూడా ఇది మరింత రచ్చకు కారణమవుతుంది. అందుకే ఈ విషయంలో జగన్ ఇప్పటి నుంచే దృష్టి పెట్టడం మంచిది.