మాల్యా మాటలు నమ్మని సుప్రీం..

-

వివిధ బ్యాంకుల నుంచి వేల కోట్లరూపాయలు రుణంగా తీసుకుని విదేశాల్లో తల దాచుకున్న ప్రముఖ ప్రారిశ్రామిక వేత్త విజయ్మాల్యాకు సుప్రీంలో ఎదురుదెబ్బ తగిలింది. తాను పరారీలో ఉన్న ఆర్థిక నేరగాడినికాదంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ప్రారంభించిన విచారణ ప్రక్రియపై స్టే విధించాలంటూ మాల్యా సుప్రీంకోర్టులో పిటిషన్‌దాఖలు చేశారు. శుక్రవారం విచారణ చేపట్టిన న్యాయస్థానం స్టే ఇచ్చేందుకునిరాకరించింది. అయితే.. మాల్యా పిటిషన్‌పై వివరణ ఇవ్వాలంటూ ఈడీ అధికారులకునోటీసులు జారీ చేసింది. వివిధ ఆర్థిక నేరాలకు సంబంధించి కేసులను ఎదుర్కొంటున్నఆయనను విచారణ నిమిత్తం తమకు అప్పగించాలని భారత ప్రభుత్వం యూకే ప్రభుత్వాన్ని ఆశ్రయించింది.దీంతో లండన్‌లోని వెస్ట్‌మినిస్టర్‌ మేజిస్ట్రేట్స్‌ కోర్టు ఈ నెల పదో తేదీనతీర్పు ఇవ్వనుంది.

ఈ కేసులో మాల్యాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చే అవకాశాలుకన్పిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారతీయ బ్యాంకులకు ఇవ్వాల్సిన నూరుశాతం ప్రజాధనాన్నితిరిగి చెల్లిస్తానంటూ మాల్యా ఇటీవల పలు ట్వీట్లలో ప్రకటించారు. చేసేదేమి లేకమొత్తం రుణాన్ని తిరిగి చెల్లిస్తానంటూ మాల్యా కోరడం ఆశ్చర్యంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news