కరణ్ షోకి బాహుబలి టీం..?

-

బాలీవుడ్ దర్శక నిర్మాతగానే కాదు బుల్లితెర మీద హోస్ట్ గా కూడా కరణ్ జోహార్ కు సూపర్ క్రేజ్ ఉంది. ముఖ్యంగా కాఫ్ విత్ కరణ్ అంటూ ఆయన చేస్తున్న షో సక్సెస్ అయ్యింది. ఈ షోకి సెలబ్రిటీస్ వచ్చి తమ వ్యక్తిగత విషయాలు కూడా పంచుకుంటారు. అయితే ఈ షోకి బాహుబలి టీం ను తీసుకొచ్చే ఆలోచనలో ఉన్నాడట కరణ్ జోహార్. బాహుబలి మొదటి రెండు పార్టులు సృష్టించిన సంచలనాలు అన్ని ఇన్ని కావు.

ఇప్పటికి బాహుబలి పేరు వినిపించినా సరే ప్రేక్షకుల్లో అదో వైబ్రేషన్స్ వస్తాయి. కాఫ్ విత్ కరణ్ ప్రస్తుతం 6వ సీజన్ నడుస్తుంది. ఈ షోలో బాహుబలి టీం అంటే రాజమౌళి, ప్రభాస్, రానాలను గెస్టులుగా పిలుస్తున్నాడట. అయితే ప్రభాస్ వస్తే అనుష్కతో ప్రేమ, మ్యారేజ్ అప్డేట్స్ గురించి కచ్చితంగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

రాజమౌళి కూడా ట్రిపుల్ ఆర్ పై క్లూ ఇవ్వాల్సి వస్తుంది. రానా కూడా తన పెళ్లి, మిగతా సినిమా విషయాలను పంచుకోవాల్సి ఉంటుంది. అయితే వారి షెడ్యూల్ ఎప్పుడన్నది మాత్రం ఇంకా బయటపడలేదు.

Read more RELATED
Recommended to you

Latest news