మోదీ బర్త్ డే స్పెషల్.. 6800 కిలోల కేట్ కటింగ్!

-

680 అడుగుల పొడవు ఉండి 6800 కిలోల బరువు ఉన్న కేక్ ను ఎప్పుడైనా చూశారా? సూరత్ లో మోదీ బర్త్ డే సందర్భంగా ప్రత్యేకంగా తయారు చేయించారు. నిన్న సోమవారం మోదీ 68వ పుట్టిన రోజు సందర్భంగా సూరత్ లోని వెసులో ఉన్న స్వర్ణ భూమి పార్టీ ప్లాట్ లో ఇంత భారీ కేక్ ను కట్ చేశారు.

ఈ కేక్ ను 1150 కిలోల మైదా, 1550 కిలోల చక్కెర, 225 కిలోల ప్రొటీన్ పౌడర్, 1150 కిలోల కోకో పౌడర్, 25 కిలోల కారమెల్, 1675 కిలోల క్రీమ్, 850 కిలోల చాకోలేట్ చిప్స్, 350 కిలోల నూనె, 125 కిలోల కేక్ జెల్ కలిపి తయారు చేశారట. 50 మంది కలిసి 10 గంటలు కష్టపడి ఈ కేక్ ను 16 డిగ్రీల టెంపరేచర్ లో తయారు చేశారట. మన దేశ ప్రధానికి తన పుట్టిన రోజున ఏదో కొత్తగా, వినూత్నంగా చేద్దామనుకొని ఈ కేక్ ను తయారు చేయించాం.. అని చెబుతున్నాడు కేక్ ను తయారు చేయించిన రాజేశ్ జైన్.

మరోవైపు అదే సెప్టెంబర్ 17న పుట్టిన 1221 మంది అంతా కలిసి సూరత్ లోని సర్సానా కన్వెన్షన్ సెంటర్ లో కేక్ కట్ చేసి రికార్డు సృష్టించారు. అతుల్య శక్తి అనే పేరుతో ఈ ఈవెంట్ చేశారు. ఇదివరకు నెదర్లాండ్స్ కు చెందిన 221 మంది అంతా కలిసి కేక్ చేసి క్రియేట్ చేసిన రికార్డును వీళ్లు తిరగరాశారు.

Read more RELATED
Recommended to you

Latest news