రామ నామంతో మారుమ్రోగిపోయిన వాషింగ్టన్ వీధులు……

-

ఆంగ్లో ఇండియన్స్ వాషింగ్టన్ వీధుల్లో హిందూ జెండాలను పట్టుకొని ర్యాలీ చేశారు. దీంతో ఆ వీధుల్లో రామనామాలు హోరెత్తాయి. వచ్చే నెల జనవరి 22వ తేదీన అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం మొదలు కాబోతుంది. ప్రస్తుతం నిర్మాణం పనులు శరవేగంగా సాగుతూ ఉన్నాయి. ఈ రామ మందిరంలో రామునికి ప్రాణ ప్రతిష్టలు చేయబోతున్నారు. ఈ సందర్భంగా కొందరు అమెరికన్ హిందువులు వాషింగ్టన్ లోని మేరి ల్యాండ్ వద్ద గల భక్తాంజనేయ స్వామి ఆలయం వద్ద ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలలో చాలామంది కాషాయ జెండాలు పట్టుకుని కారు మరియు బైక్ లతో ర్యాలీ చేశారు.

అమెరికా డిసి చాప్టర్ విశ్వహిందూ పరిషత్ అధ్యక్షుడు మహేంద్ర సాప మాట్లాడుతూ వచ్చే సంవత్సరం జనవరిలో రామ మందిర ప్రారంభోత్సవం జరుగుతున్నది. కావున ర్యాలీ చేస్తూ ఉన్నామని పేర్కొన్నారు. అలాగే జనవరి 20వ తేదీన వివిధ కార్యక్రమాలు చేస్తామని తెలిపాడు. ఈ కార్యక్రమాలలో శ్రీరాముని చరిత్ర, రామ భజన ,రామ్ లీలా వంటివి నిర్వహిస్తామని తెలిపాడు. చిన్నారులతో 45 నిమిషాల పాటు రాముని యొక్క చరిత్ర చెప్పిస్తామని అన్నాడు

Read more RELATED
Recommended to you

Latest news