రామ మందిరం పై సుప్రీం కీలక తీర్పు!

-

అయోధ్యలోని బాబ్రీ మసీదు-రామ మందిరం కేసులో కీలక తీర్పును సుప్రీం కోర్టు గురువారం (సెప్టెంబర్ 27న) వెలువరించనుంది.  సుప్రీం ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా రిటైర్మెంట్‌కు కొన్ని రోజుల ముందు.. హిందువులు, ముస్లింలకు సంబంధించిన కీలక తీర్పు వెల్లడిపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది.  అత్యధిక రాజ్యాంగ ధర్మాసనాలకు నేతృత్వం వహించిన సీజేఐగా రికార్డు సాధించిన జస్టిస్‌ మిశ్రా రిటైర్మెంట్‌కు ముందు వారం రోజుల్లో ఆధార్‌, అయోధ్య రామ మందిర నిర్మాణం, లాయర్లుగా ప్రజాప్రతినిధులు కొనసాగాలా.. వద్దా!, శబరిమల ఆలయంలోకి మహిళల ప్రవేశం,  వ్యభిచారం కేసు (ఐపీసీ సెక్షన్‌ 497కు సవరణలు), పదోన్నతుల్లో రిజర్వేషన్లు, విచారణల ప్రత్యక్ష ప్రసారాల కేసు, నేర ప్రజా ప్రతినిధులపై నిషేధం కేసు, అనే 8 కీలక కేసులను విచారిస్తుండటం గమనార్హం.

ఆధార్ వల్ల వ్యక్తిగత సమాచారానికి ఎలాంటి ఇబ్బంది కలగదు అంటూ బుధవారం తీర్పు వెలువరించిన సంగతి తెలిసిందే. గత వారం స్వలింగ సంపర్కం నేరం కాదంటూ ఐపీసీ సెక్షన్‌ 377ను రద్దు చేస్తూ జస్టిస్‌ మిశ్రా నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల ధర్మాసనం ఈ నెలలో చరిత్రాత్మక తీర్పునిచ్చింది.

అన్ని కేసుల్లో అత్యంత కీలకమైన  బాబ్రీ మసీదు- రామ జన్మభూమి కేసును తాము పూర్తిగా ‘భూవివాదం’ (ప్యూర్‌ లాండ్‌ డిస్‌ప్యూట్‌)గా పరిగణిస్తామని దీపక్ మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం గతంలోనే వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.

 

Read more RELATED
Recommended to you

Latest news