రాహుల్ ని గద్దర్ కలవడంపై ఆంతర్యం ఏమిటీ? 

-

ప్రజాగాయకుడు గద్దర్ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీని శుక్రవారం కలవడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటని రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) అధినేత కె. చంద్రశేఖర రావుకు దూరంగా ఉన్న శక్తులను కలుపుకుని తెరాసకు  వ్యతిరేకంగా పనిచేసే వారిని దగ్గరకు తీసుకోవడం రాహుల్ వ్యూహంలో భాగంగా కనిపిస్తోంది.  ఇందులో భాగంగానే గతంలో తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న వారికి పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు..ఈ క్రమంలో ఆ విజ్ఞప్తిని సున్నితంగా తిరస్కరించిన గద్దర్ తాను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడానికి ఇష్టపడుతున్నట్లు చెప్పారు. గజ్వెల్ లో కేసిఆర్ పై గానీ, మరో సీటులో గానీ తాను పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు గద్దర్ రాహుల్ గాంధీతో చెప్పారు.  స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, అందుకు మహా కూటమి నేతలను ఒప్పించాలని గద్దర్ రాహుల్ గాంధీని కోరినట్లు తెలుస్తోంది. అందుకు రాహుల్ గాంధీ అంగీకరించినట్లు కూడా తెలుస్తోంది. కాంగ్రెసులో ఉన్న తన కుమారుడు సూర్య కిరణ్ కు బెల్లంపల్లి టికెట్ గురించి చర్చించినట్లు సమాచారం. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో కాంగ్రెస్ మరింత స్పీడు పెంచి తెరాస వ్యతిరేక శక్తులను ఏకం చేసేపనిలో పడ్డాయని కొంతమంది నేతల అభిప్రాయం.

Read more RELATED
Recommended to you

Latest news