‘తిత్లీ’ తుపానుకు ఆ పేరు పెట్టింది మన దాయాది పాకిస్తాన్..!

-

తిత్లీ.. గత రెండు రోజులుగా దేశం మొత్తం ఇదే పేరును జపిస్తోంది. అసలేంటి ఈ పేరు… అంటే.. ఇదో తుపాను. ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాను ప్రస్తుతం ఈ తుపాను వణికిస్తోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా ఈ తుపాను ధాటికి అతలాకుతమైంది. గత గురువారం ఉదయమే తిత్లీ తీరం దాటంతో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశాలో తీవ్రవైన గాలులు వీయడం, భారీ వర్షాలు పడటంతో జనజీవనం అస్తవ్యస్తం అయింది. వెంటనే సహాయక చర్యలు మొదలయ్యాయి. సరే.. తిత్లీ బీభత్సం గురించి మొన్నటి నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. మనం ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ వార్త చెప్పుకోవాలి. అదే తిత్లీ అనే పేరు. అసలు ఈ తుపానుకు తిత్లీ అనే పేరు ఎందుకు పెట్టారు.. ఎవరు పెట్టారు.. అనేది కాస్త ఆసక్తిగానే ఉంటుంది కదా. ఇదే ఉత్తరాంధ్రను నాలుగేళ్ల క్రితం హుద్ హుద్ అనే తుపాను కుదిపేసింది. అసలు.. ఈ తుపాన్లకు రకరకాల పేర్లు ఎవరు పెడతారు.. అనే విషయాలు తెలుసుకుందాం పదండి.

నిజానికి.. తుపాన్లకు పేర్లు పెడితే.. వాటి విధ్వసం, వాటి వల్ల జరిగే నష్టం.. ఇతర విషయాలను భావితరాలకు ఎటువంటి గందరగోళం లేకుండా అందించవచ్చనే ఒకే ఒక కారణంతో వాటికి రకరకాల పేర్లు పెడుతున్నారు. అందుకే ప్రపంచ వాతావరణ సంస్థ 2004లో ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. సౌత్ ఏసియాకు చెందిన ఎనిమిది దేశాలను అది ఆ సమావేశానికి పిలిచింది. ఆ సమావేశంలో భారత్, మన దాయాది పాకిస్తాన్, బంగ్లాదేశ్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, శ్రీలంక, థాయిలాండ్ దేశాలు పాల్గొన్నాయి. ఆయా దేశాలతో ఓ కమిటీని ఏర్పాటు చేసింది.

ఆ సమావేశంలో జరిగిన చర్చ ఏంటంటే.. సౌత్ ఏసియాలో భవిష్యత్తులో వచ్చే ఏ విపత్తుకైనా ఒక పేరు పెట్టాలని. అందుకే మొత్తం 64 పేర్లను సంస్థ సిద్ధం చేసింది. 8 దేశాలకు తలా 8 పేర్లను సమర్పించింది. భవిష్యత్తులో హిందూ, బంగాళా ఖాతం, అరేబిమా మహా సముద్రాల్లో రాబోయే తుపాన్లకు ఆ పేర్లు పెట్టాలని నిర్ణయించారు.

అలా ప్రతి తుపానుకు వాటిలోని ఏదో ఒక పేరు పెడుతూ వచ్చారు. హుద్ హుద్ తుపాను పేరును ఒమన్ దేశం పెట్టగా… ఇప్పుడు బీభత్సం సృష్టిస్తున్న తిత్లీ తుపాను పేరును పాకిస్తాన్ పెట్టింది. భారత్ కు అగ్ని, ఆకాశ్, బిజ్లీ, జల్, లెహర్, మేఘ్, సాగర్, వాయు అనే పేర్లను కమిటీ ఇవ్వగా.. అందులో ఏడు పేర్లను భారత్ ఇదివరకే ఉపయోగించింది. ఇక.. మిగిలింది ఒక వాయు మాత్రమే.

Read more RELATED
Recommended to you

Latest news