మహేష్ బాబు తక్కువ సమయంలోనే ప్రిన్స్ స్టార్ గా గుర్తింపు దక్కించుకున్నారు. ప్రస్తుతం ఈయన నటించిన ‘గుంటూరు కారం’ సినిమా నేడు వరల్డ్ వైడ్ గ్రాండ్ గా విడుదల అయినది. దీంతో థియేటర్ల వద్ద పండుగ వాతావరణం నెలకొంది.
సూపర్ స్టార్ మహేష్ ఇలా సినీ ఇండస్ట్రీలో నటిస్తూనే.. వ్యాపార రంగంలో అడుగు పెట్టారు. బిజినెస్ లో కూడా ఈ హీరో కోట్లు సంపాదిస్తున్నాడని తెలుస్తోంది. ప్రిన్స్ కి థియేటర్లు,రెస్టారెంట్లు ఉన్న విషయం తెలిసిందే. హైదరాబాదులో ఫేమసైన ఏంఎంబీ సినిమాస్ కు మహేష్ బాబు ఓనర్ గా వ్యవహరిస్తున్నారు. అలాగే హైదరాబాదులోనే ఏషియన్ వారితో కలిసి మహేష్ ఓ రెస్టారెంట్ కూడా స్టార్ చేశారు. ఈ ఏఎన్ ప్యాలెస్ హైట్స్ రెస్టారెంట్ బంజారాహిల్స్ లో ఉంది.అయితే ఇందులో ఒక ప్లేట్ టిఫిన్ కు ఏకంగా 500 నుంచి 600 రూపాయల వరకు రేట్లు భారీగా ఉన్నా జనాలు చాలా మందే వెళ్తుంటారు. ఎందుకంటే ఇక్కడ చేసే ఐటమ్స్ ఎంతో రుచికరంగా ఉంటాయట. కాగా మహేష్ బాబుకు డైలీ ఏకంగా 8 నుంచి 10 లక్షల వరకు ఆదాయం వస్తుందని పలు సోషల్ మీడయా ప్లాట్ ఫామ్ లో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.