డాన్సింగ్ అంకుల్ డబ్బూ.. మళ్లీ ఇరగదీశాడుపో.. ఈసారి ఏ పాటకు డ్యాన్స్ చేశాడంటే..!

-

డాన్సింగ్ అంకుల్.. డబ్బూ ది డాన్సర్.. గురించి సోషల్ మీడియా అభిమానులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాత్రికి రాత్రే స్టార్ అయిన ఈ డాన్సింగ్ అంకుల్ సంజీవ్ శ్రీవాస్తవ్ మరోసారి తన డాన్స్ తో ఇరగదీయడానికి వచ్చాడు. ఇదివకు గోవింద డాన్స్ తో కుర్రకారుకు పిచ్చెక్కిచ్చిన సంగతి తెలిసిందే.

ఇప్పుడు మిథున్ చక్రవర్తి పాట జూలీ జూలీకి అద్భుతంగా డాన్స్ చేసి మళ్లీ ఔరా అనిపించుకున్నాడు. ఇప్పుడు దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. ఇంకెందుకు ఆలస్యం.. మన డబ్బూ ది డాన్సర్ డాన్స్ పర్ఫార్మెన్స్ చూసి ఎంజాయ్ చేయండి. ఈ డ్యాన్స్ చూసి మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ కూడా మెచ్చుకున్నాడట. తన అరుదైన డాన్స్ స్టయిల్ తో అతి తక్కవ కాలంలో స్టార్ అయిపోతానని కలలో కూడా ఊహించుకొని ఉండడు సంజీవ్. అదృష్టమంటే అదే మరి. నక్క తోక తొక్కి వచ్చినట్టున్నాడు అందుకే ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ డబ్బూ డాన్సర్ గురించే చర్చ.

Read more RELATED
Recommended to you

Latest news