నేటి విద్యావ్యస్థ కేవలం డిగ్రీలతో పాటు, ఉపాధిని పొందే విధంగా మాత్రమే కొనసాగుతుందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. తిరుపతిలోని భారతీయ విద్యాభవన్ విద్యాలయ వార్షికోత్సవంలో మంగళవారం వెంకయ్యనాయుడు మాట్లాడుతూ… తన చిన్నప్పుడు తోటపని, మోరల్ సైన్స్ తరగతులు ఉండేవని.. ఇప్పుడు సైన్స్ ఉంది కానీ మోరల్ పోయిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. విద్యార్థుల్లో మనో విజ్ఞానం, ఆత్మ విశ్వాసం పెంపొందే విధంగా విద్యావ్యవస్థలో మార్పులు రావాలని కోరారు.
అంతకు ముందు తిరుమల శ్రీవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేశంలోని వీఐపీలకు ఏడాదికి ఒక సారి మాత్రమే వీఐపీ దర్శనం వెసులు బాటు కల్పిస్తే బాగుంటుందని ఉపరాష్ట్రపతి అభిప్రాయం వ్యక్తం చేశారు.