భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం జరిగింది. చర్ల బస్టాండ్ సమీపంలో నివసించే పున్నం చుక్కయ్య, యల్లమ్మలు చాకలి పని చేసుకుంటూ వృద్ధ దంపతులు జీవనం సాగిస్తున్నారు, తెల్లవారుజామున చుక్కయ్య ఇంటిలోకి ప్రవేశించిన గుర్తు తెలియని వ్యక్తులు వృద్ధులపై కత్తులతో విచక్షణారహితంగా నరికారు. ఈ దాడిలో దంపతులిద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హత్యకు గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీరికి ఐదుగురు కుమారులున్నట్లు సమాచారం.