నేడు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులపై చర్చలు సాగాయి. అధికారం మరియు ప్రతిపక్షాల మధ్య వాడివేడిగా చర్చలు సాగాయి. ఈ క్రమంలో మాజీ మంత్రి హరీష్ రావు పై సీఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు. హరీష్ రావు ఇంకా మంత్రి అనుకుంటున్నారని మంత్రి లాగా సమాధానం చెబుతున్నాడని మండిపడ్డాడు. లక్ష కోట్లు ఖర్చుపెట్టిన లక్ష ఎకరాలకు సాగునీటిని ఇవ్వలేకపోయారని అన్నారు. హరీష్ రావు సత్యహరిచంద్ర మాదిరిగా మాట్లాడుతున్నాడని విమర్శించాడు.
13 లక్షల 72 కోట్లు గత ప్రభుత్వం ఖర్చు చేసిందని ఆరోపించారు. రాజు ఆరోగ్య శ్రీ కి నిధులు ఇవ్వలేదని దళితులకు మూడేకారాల భూమి కేటాయించలేదని పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టించలేదని మండిపడ్డాడు. హాస్టల్లో వంట చేసే వాళ్లకు జీతాలు ఇవ్వలేదని అలాగే వృద్ధులకు పెన్షన్ ఇచ్చి పెద్ద కొడుకు అన్నాడని కానీ వారికి నెల నెల పెన్షన్ ఇవ్వలేదని దుయ్యబట్టారు.వెట్టి చాకిరిని నిషేధించమని అలాగే ప్రతిపక్షాలకు కూడా స్వేచ్ఛను ఇస్తున్నామని ఈ సమావేశంలో తెలిపారు.