సుప్రీం కోర్టు తదుపరి సీజే దస్త్రం పై రాష్ట్రపతి ఆమోదం

-

సుప్రీం కోర్టు తదుపరి భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)గా జస్టిస్ రంజన్ గొగోయ్ ని నియమిస్తూ రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. దీనికి సంబంధించిన దస్త్రం పై గురువారం రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ సంతకం చేశారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా అక్టోబర్ 2న పదవీవిరమణ చేయనున్న నేపథ్యంలో తన  తదుపరి వారసుడిగా గొగోయ్ పేరుని ఇటీవలే మిశ్రా సిఫార్సు చేశారు. సదరు సిఫార్సుకి సంబంధించిన దస్త్రంపై రాష్ట్రపతి ఈ రోజు సంతకం చేశారు.  సీజేఐ గా జస్టిస్ రంజన్ గొగోయ్ సెప్టెంబర్ 3న బాధ్యతలు చేపట్టనున్నారు.

జస్టిస్ రంజన్ గొగోయ్ 1978లో బార్ అసోసియేషన్లో చేరారు. 2001 ఫిబ్రవరి 28 న గువాహాటి హైకోర్టులో జడ్జిగా నియమితులయ్యారు. 2010 సెప్టెంబర్ పంజాబ్, హర్యాణ హైకోర్టుకు బదిలీ అయ్యారు ఆ  తర్వాత 2011లో అదే కోర్టుకు ప్రధాన న్యాయమూర్తిగా నియమితులయ్యారు. కొద్దికాలనికే ఆయన 2012 ఏప్రిల్ లో సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి పొందారు.

Read more RELATED
Recommended to you

Latest news