68 కిలోల బంగారం, 327 కిలోల వెండితో చేసిన వినాయకుడిని చూశారా?

-

గోల్డ్ గణపతి పేరు విన్నారా ఎప్పుడైనా? ముంబైలోని మాటుంగాలో ఉన్న కింగ్స్ సర్కిల్ దగ్గర ప్రతి సంవత్సరం ఈ గోల్డ్ గణపతిని నిలబెడతారు. ఆయన స్పెషాలిటీ ఏంటంటే… ప్రతి సంవత్సరం రిచెస్ట్ గణపతి ఈయనే. అందరు గణపతులన కన్నా రిచ్ వినాయకుడు అన్నమాట. ఆయన ఒంటి మీద 68 కిలోల బంగారం, 327 కిలోల వెండి ఆభరణాలను అలంకరిస్తారు. వజ్రాలు, వైడూర్యాలు కూడా పెడతారు. సాధారణంగా ఈ విగ్రహం ఎత్తు 14.5 అడుగులు ఉంటుంది.

అయితే.. దీనికి ఇంకో విశిష్టత కూడా ఉందండోయ్. ఈ గణేశ్ మండలికి రూ.264.75 కోట్లకు ఇన్సురెన్స్ చేయించారు. వామ్మో ఇంత డబ్బా అని షాక్ కాకండి. ఇంకా ఉంది. అసలు దేశంలోనే ఏ గణేశ్ మండలికి కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇన్సురెన్స్ చేయించరు. కానీ.. ఈ వినాయకుడు అందరి కన్నా స్పెషల్. ముంబై ఫేమస్ లాల్ బాగ్ చా రాజా గణేశ్ మండలిని రూ.25 కోట్లకు బీమా చేయించారు. ఈ గణపతి ఐదు రోజులు మాత్రమే పూజలు అందుకుంటాడు. తర్వాత యథావిథిగా నిమజ్జనం చేస్తారు. ఇక.. ఐదు రోజుల్లో రోజు చేసే కార్యక్రమాలకు, విగ్రహానికి ఉన్న ఆభరణాలకు రోజుకు రూ. 52.85 కోట్లకు బీమా చేయించారు. దాంతో పాటు వాలంటీర్లు, ఇతర పనివాళ్లతో సహా అక్కడ ఉండేవాళ్లందరి కోసం 224.40 కోట్లు పెట్టి బీమా చేయించారు. అంటే ఏదైనా అనుకోని ప్రమాదం జరిగినా ఒక్కొక్కరికీ రూ. 10 లక్షలు వచ్చేలా బీమా చేయించారన్నమాట. ఇది గోల్డ్ గణేశ్ స్పెషాలిటీ.

Read more RELATED
Recommended to you

Latest news