‘సేవ్ నేషన్’లో భాగంగా…రాహుల్ తో బాబు భేటీ…

-

ఏపీ సీఎం, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు భాజపేతర శక్తులను ‘సేవ్ నేషన్’ అనే నినాధంతో  వివిధ పార్టీలను  కూడగట్టే పనిలో భాగంగా కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో నేడు భేటీ కానున్నారు. ఇందులో భాగంగా ఆయన ఢిల్లీ వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో శరద్‌పవార్‌, అఖిలేష్‌యాదవ్‌, సురవరం సుధాకరరెడ్డి, ఫరూక్‌ అబ్దుల్లాలతో, యశ్వంత్‌ సిన్హ, జాతీయ స్థాయి రాజకీయాల గురించి చర్చించనున్నారు.. మోడీ, అమిత్‌షా చేస్తున్నకుట్రలను చర్చించన్నారు. జయలలిత మరణం అనంతరం తమిళనాడులో భాజపా అనుసరించిన తీరు, ప్రస్తుతం సుప్రీం కోర్టు తీర్పును అనుసరించి కేరళలో అమిత్‌షా ఆధ్వర్యంలో చేస్తున్న అరాచకాలపైనా ఈ సమావేశంలో చర్చించే అవకాశముంది. అదే తరహాలో ఏపీలోని తెదేపా నాయకులను భయాందోళనకు గురిచేసే విధంగా ఉద్దేశపూర్వకంగా ఐటి దాడులు, విజిలెన్స్‌ తనిఖీలు చేయిస్తున్నారని, నాయకత్వాన్ని దెబ్బతీసేందుకు ఇటువంటి కుట్రలకు పాల్పడుతున్నారని కేంద్ర స్థాయిలో ఆయా పార్టీల నాయకత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కేంద్రంలో ఏ ప్రభుత్వం ఉన్నా సరే వారిని దారిలో పెట్టేవిధంగా చేయడమే తెదేపా విధానం అని పార్టీ నేతలు వెళ్లడిస్తున్న సంగతి తెలిసిందే.. ఏది ఏమైన రాహుల్ తో బాబు భేటీ దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

Read more RELATED
Recommended to you

Latest news