సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్‌లో ఖాళీలు..వివరాలివే..!

-

ఉద్యోగం కోసం చూస్తున్నారా..? అయితే మీకో అవకాశం. కోల్ ఇండియా లిమిటెడ్ (Coal India Limited) యొక్క అనుబంధ సంస్థల్లో సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) ఒక‌టి. తాజాగా సౌత్ ఈస్టర్న్ కోల్‌ఫీల్డ్స్ లిమిటెడ్ (SECL) ఒక నోటిఫికేషన్ ని విడుదల చెయ్యడం జరిగింది. ఆసక్తి, అర్హత వున్న వాళ్లు ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. ఇక ఈ నోటిఫికేషన్ కి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..

SECL క్లర్క్ రిక్రూట్‌మెంట్ 2021 ద్వారా ఈ పోస్టులు భ‌ర్తీ చేస్తున్నారు. ఇందులో ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ వెలుడింది. ఇది ఇలా ఉంటే దీనిలో 196 గ్రేడ్-3 క్లర్క్ పోస్టుల అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు. ఇక అర్హత విషయంలో వస్తే.. వృత్తి ప‌ర‌మైన అనుభ‌వంతో పాటు ఖచ్చితమగా అభ్య‌ర్థి ప‌దో త‌ర‌గ‌తిలో పాస్ అయి ఉండాలి. అలానే ఈ పోస్టుల‌కు ప‌రీక్ష, కంప్యూట‌ర్ నైపుణ్యం ఆధారంగా అభ్య‌ర్థుల‌ను ఎంపిక చేస్తారు.

ఎంపిక విధానం గురించి చూస్తే.. రాత‌ ప‌రీక్ష‌కు 60 మార్కులు, కంప్యూట‌ర్ టెస్ట్‌కు 40 మార్కులు మొత్తం 100 మార్కుల‌కు ప‌రీక్ష ఉంటుంది. దీని ఆధారంగా సెలెక్షన్ ఉంటుంది. ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు ఆఖ‌రు తేదీ సెప్టెంబ‌ర్ 16, 2021. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు secl-cil.in అధికారిక వెబ్‌సైట్‌లో పూర్తి స‌మాచారాన్ని పొంద‌వ‌చ్చు.

Read more RELATED
Recommended to you

Latest news