స్టన్నింగ్ స్టిల్‌తో సూర్య కంగువ సెకండ్‌ లుక్‌ అప్‌డేట్‌

-

శివ దర్శకత్వంలో తమిళ నటుడు సూర్య నటిస్తున్న తాజా చిత్రం కంగువ . పీరియాడిక్ యాక్షన్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా గ్లింప్స్ ‌ వీడియో, కంగువ పోస్టర్లు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ నెట్టింట్లా వైరల్ అవుతున్నాయి. తాజాగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ చిత్ర బృందం కొత్త లుక్‌ ఒకటి రిలీజ్ చేశారు. ఈ చిత్రం సెకండ్‌ లుక్‌ను రేపు ఉదయం 11 గంటలకు లాంఛ్ చేస్తున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

స్టూడియో గ్రీన్-యూవీ క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. 2024లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. కంగువ లో దిశాపటాని హీరోయిన్గా నటిస్తుంది .బాబీ డియోల్ కీలకపాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.గతానికి, ప్రస్తుతకాలానికి మధ్య ఉండే కనెక్షన్‌తో సాగే స్టోరీలైన్‌ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్టు తెలుస్తుంది.కంగువ కోసం నా చివరి షాట్‌ పూర్తయింది,మంచి జ్ఞాపకాలు అందించిన శివ అండ్‌ టీంకు ధన్యవాదాలు అని హీరో సూర్య అన్నారు. నటుడు సూర్య సుధా కొంగర దర్శకత్వంలో తన 43వ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news