హుజురాబాద్ ఉపఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. కాగా పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో టీఆర్ఎస్ ఆధిక్యంలో ఉండగా మొదటి రౌండ్ లో బీజేపీ ఆధిక్యంలోకి వచ్చింది. ఇదిలా ఉండగా హుజురాబాద్ లో ఇండిపెండెంట్ అభ్యర్థుల గుర్తులు ప్రధాన పార్టీలకు షాక్ ఇస్తున్నాయి. హుజురాబాద్ లో కారును పోలిన రోటీ మేకర్ గుర్తుకు 122 ఓట్లు పడ్డాయి. దాంతో టీఆర్ఎస్ కు నష్టం జరిగింది. ఇక గతంలోనూ కొన్ని ఎన్నికలల్లో రోడ్డు రోలర్ మరియు రోటీ మేకర్ గుర్తులతో టీఆర్ఎస్ కు ఇబ్బందులు వచ్చాయి.
దాంతో టీఆర్ఎస్ ఎన్నికల సంఘానికి ఆ గుర్తులను తొలగించాలని ఫిర్యాదు చేయగా రోడ్డు రోలర్ ను తొలగించారు. కానీ రోటీమేకర్ ఓ గుర్తింపు పొందిన పార్టీకి సంబంధించిన పార్టీ గర్తు కావడంతో దానిని తొలగించలేదు. ఇదిలా ఉంటే హుజురాబాద్లో కమలం గుర్తును పోలి ఉన్న వజ్రం గుర్తుకు కూడా 112 ఓట్లు పడ్డాయి. దాంతో బీజేపీ కూడా ఇబ్బంది పడుతోంది. ఒకవేల రెండు పార్టీల మధ్య టఫ్ ఫైట్ జరిగితే ఇలా నష్టపోయిన ఓట్ల వల్ల పెద్ద ముప్పే పొంచిఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.