హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీలో జాయింట్ మెట్రోపాలిటన్ కమిషనర్ గా ఐఏఎస్ అధికారిణి ఆమ్రపాలి శుక్రవారం బాధ్యతలు స్వీకరించింది. తెలంగాణలో నూతన ప్రభుత్వం చేపట్టిన తర్వాత సీఎం రేవంత్ రెడ్డి పరిపాలన సౌలభ్యం కోసం నూతన యంత్రంగాని మార్చే ప్రక్రియలో భాగంగానే ఈ లేడీ సింగంని నియమించాడు. ఈ సందర్భంగా పలువురు ఆమెని అభినందించారు.
మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసేందుకు ఈ అవకాశం ప్రభుత్వం తనకి ఇచ్చిందని తెలిపింది. ఆ తర్వాత మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండిగా బాధ్యతలు చేపట్టి ఆ తర్వాత అధికారులతో ఇంటరాక్ట్ అయ్యింది.మొత్తం ఏడు జిల్లాలు 7200 చదరపు కిలోమీటర్ల పరిధిలో హెచ్‌ఎండీఏ విస్తరించి ఉంది. దాదాపు కోటిన్నర జనాభా ఈ పరిధిలో నివసిస్తున్నారు. దీంతో 3 కోట్ల వరకు జనాభా పెరగనుందని అంచనా వేస్తున్నారు. నూతన అధికారిణిగా బాధ్యతలు స్వీకరించిన ఆమ్రపాలికి హెచ్ఎండిఏ కార్యదర్శి చంద్రయ్య, చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి, అర్బన్ ఫారెస్ట్ డైరెక్టర్ డాక్టర్ బి. ప్రభాకర్ ఐఎఫ్ఎస్, ఎస్టేట్ ఆఫీసర్ కిషన్ రావు, ప్లానింగ్ డైరెక్టర్లు విద్యాధర్, శ్రీనివాస్, లీగల్ స్పెషలిస్ట్ యశస్వి సింగ్ లతో పాటు హెచ్ఎండిఏ అధికారులు, సిబ్బంది జాయింట్ కమిషనర్ ఆమ్రపాలిని కలసి అభినందించారు.