ఆగస్టులో బ్యాంకులకు 10 రోజు సెలవులు..!

-

దేశంలో కరోనా వ్యాప్తి చెందుతున్న విషయం అందరికి తెలిసందే. దీంతో బ్యాంకు అధికారులు వారి పని టైమింగ్స్ లో మార్పులు చేశారు. అక్కడి పరిస్థితులకు అనుగుణంగా ఫుల్ టైమ్ కాకుండా, కొంత సమయం మాత్రమే బ్యాంకులను ఓపెన్ చేసి ఉంచుతున్నారు. బ్యాంకు లావాదేవిలకు ఆగస్టు నెలలో సెలవుల ఎఫెక్ట్ గట్టిగానే ఉండనుంది. అయితే ఆగష్టు నెలలో బ్యాంకులకు ఎక్కువ సెలవులు రాబోతున్నాయని బ్యాంకు అధికారులు వెల్లడించారు.

bank
bank

మీరు ఆగస్టులో ఏవైనా బ్యాంకు పనులు ప్లాన్ వేసుకున్నారు అయితే ముందుగానే త్వరపడండి. అదికాక ముఖ్యమైన బ్యాంకు లావాదేవీలు ఏవైనా ఉన్నాయా అయితే అసలు ఆలస్యం చేయకండి. ఎందుకంటే ఆగస్టులో బ్యాంకులకు సెలవులు ఎక్కవగా ఉన్నాయి. అయితే ముందుగానే బ్యాంకులకు ఏఏ రోజుల్లో సెలవులు ఉంటాయో తెలుసుకొని మీ లావాదేవీలు ప్లాన్ చేసుకుంటే మంచిదని అధికారులు తెలుపుతున్నారు. మరి ఆగస్టులో ఏ రోజుల్లో బ్యాంకులు పనిచేయవో తెలుసుకోండి.ఇంతకీ ఆగస్టులో ఎన్ని రోజు సెలవు వస్తున్నాయో చూద్దామా…

అయితే ఆగస్టులో ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు ఎలాగూ సెలవే. కాబట్టి ఆగస్టులో మరిన్ని సెలవులు రాబోతున్నాయి. ఇవి కాకుండా పండుగులు కూడా ఉన్నాయి. అయితే ఆగస్టు 1వ తేదీ బక్రీద్, ఆగష్టు 2 ఆదివారం, ఆగష్టు 8 రెండో శనివారం, ఆగస్టు 9 ఆదివారం, ఆగష్టు 11 కృష్ణాష్టమి, ఆగష్టు 15 స్వాతంత్ర దినోత్సవం, ఆగస్టు 16 ఆదివారం, ఆగష్టు 22 నాలుగో శనివారం, వినాయక చవితి, ఆగష్టు 23 ఆదివారం, ఆగస్టు 30 ఆదివారం. మొత్తం 10 రోజులు బ్యాంకులు మూతపడే అవకాశముంది.

అయితే వీటికి తోడు ఆగస్ట్‌ 3న రక్షా బందన్ కావడంతో అహ్మదాబాద్‌, డెహ్రాడూన్‌, జైపూర్‌, కాన్పూర్‌, లక్నో తదితర పట్టణాలలో బ్యాంకులు పనిచేయవు. ఇక 11న కృష్ణాష్టమి సందర్భంగా భువనేశ్వర్‌, చెన్నై, హైదరాబాద్‌, పాట్నా ప్రాంతాల్లో 12న కొన్ని ప్రాంతాల్లో సేవలు నిలిచిపోనున్నాయి. కాబట్టి బ్యాంకు పనులు ఉన్నవారు ముందు జాగ్రత్తగా వీటిని గుర్తుపెట్టుకుంటే మంచిదని బ్యాంకు అధికారులు వెల్లడించారు.

Read more RELATED
Recommended to you

Latest news