కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా జగన్ సర్కార్ కీలక ముందడుగు వేస్తూ సమర్థవంతంగా కరోనా వైరస్ ని ఎదుర్కొనేందుకు సిద్ధం అవుతున్న విషయం తెలిసిందే. అయితే కరోనా వైరస్ నియంత్రణలో భాగంగా ప్లాస్మా థెరపీ ఎంతో కీలకపాత్ర వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే జగన్ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. జగన్ సర్కార్ తీసుకున్న నిర్ణయం కరోనా రోగుల అందరికీ ఒక వరంలా మారింది.
కరోనా వైరస్ నుంచి కోలుకున్న వారు ప్లాస్మా దానానికి ముందుకు రావాలంటూ ఇప్పటికే ఎంతో మంది అధికారులు నాయకులు పిలుపునిచ్చారు. ప్లాస్మా దానం విషయంలో తాజాగా జగన్ సర్కార్ మరో ముందడుగు వేస్తుంది.ప్లాస్మా దానం చేసే వారికి ఐదు వేల రూపాయలు ఇవ్వాలని జగన్ సర్కారు నిర్ణయించింది. అంతేకాకుండా ప్లాస్మా దానం వల్ల కలిగే ప్రయోజనాల గురించి కూడా ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు సీఎం జగన్. అంతేకాకుండా అత్యవసర మందులు ఎప్పుడూ అందుబాటులో ఉంచుకోవాలని… కరోనా రోగులు అందరికీ బెడ్స్ ఎప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలంటూ ఆదేశాలు జారీ చేశారు.