కొత్త సచివాలయం నమూనాపై ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష…!?

-

తెలంగాణ ప్రభుత్వం పాత సచివాలయాన్ని కూల్చివేసి అధునాతన హంగులతో కొత్త సచివాలయ నిర్మాణానికి సంకల్పించిన విషయం తెలిసిందే. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని కొంతమంది సవాల్ చేస్తూ న్యాయస్థానాలను ఆశ్రయించడం తో… కొన్ని నెలలపాటు సచివాలయం కూల్చివేత నిలిచిపోయింది. ఇటీవల హైకోర్టు నుండి సచివాలయ కూల్చివేతకు ప్రభుత్వానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో శరవేగంగా కూల్చివేత పనులు జరుగుతున్నాయి.

అదే సమయంలో నూతన సచివాలయం నమూనాపై కూడా శరవేగంగా పనులు జరుగుతున్నట్టు తెలుస్తోంది. కొత్త సచివాలయం నమూనాపై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్ లో… సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్ష లో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇంజనీర్లు ఆర్కిటెక్చర్ లు పాల్గొన్నట్లు సమాచారం. చెన్నైకి చెందిన ఆర్కిటెక్చర్ ఆస్కార్ పొన్ని ఇచ్చిన నమూనాకు సూత్రప్రాయంగా ఆమోదం తెలిపిన ముఖ్యమంత్రి.. కేసిఆర్.. కొన్ని మార్పులు చేర్పులు సూచించినట్లు తెలుస్తోంది. కేసిఆర్ సూచించిన విధంగా మార్పు చేర్పులతో కూడిన నమూనాను ఈరోజు సమీక్షలో సీఎం వద్దకు ఆర్కిటెక్ట్ లు తీసుకెళ్లినట్లు సమాచారం.

Read more RELATED
Recommended to you

Latest news