తెలంగాణాలో వంద హాట్ స్పాట్ లు…!

-

కరోనా కట్టడి విషయంలో కేసీఆర్ సర్కార్ చాలా కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది. రోజు రోజుకి కరోనా వైరస్ తీవ్రత పెరుగుతున్న నేపధ్యంలో చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. తాజాగా తెలంగాణాలో 40 కేసులు నమోదు కావడంతో 404 కి చేరింది కేసుల సంఖ్య. దీనితో ప్రభుత్వం మరింత అప్రమత్తంగా వ్యవహరిస్తుంది. రాష్ట్రంలోని 100 గ్రామాలు, ప్రదేశాల్ని హాట్ స్పాట్‌లుగా గుర్తించాలని డిసైడైంది.

కరోనా వైరస్ ఎక్కువగా వ్యాపించే ప్రాంతాల్నే ఈ టాప్ 100 లిస్టులో పెట్టింది తెలంగాణా సర్కార్. ప్రభుత్వం ప్రధానంగా ఆదిలాబాద్, నిజామాబాద్, సూర్యాపేట, గద్వాల్, మహబూబ్‌నగర్, కామారెడ్డి, ఖమ్మం జిల్లాలపై ఎక్కువగా దృష్టి పెడుతుంది. ఆదిలాబాద్ మున్సిపాల్టీలో 19 వార్డులు, నేరేడిగొండలో ఐదు గ్రామాలు, ఉట్నూరు మండలంలో మూడు గ్రామాలను హాట్‌స్పాట్లుగా గుర్తించారు. ఇక్కడ కఠిన ఆంక్షలు అమలు చేయడానికి ప్రభుత్వం రెడీ అయింది

. ఏప్రిల్ 14 తర్వాత లాక్ డౌన్ ని కొనసాగించకపోయినా సరే ఇక్కడ మాత్రం కచ్చితంగా కఠిన ఆంక్షలు ఉంటాయి. ప్రజలు ఎవరూ కూడా బయటకు రావడానికి లేదు. నిజామాబాద్ జిల్లాలో కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయి. ప్రభుత్వం ప్రకటించే 100 హాట్ స్పాట్‌లలో 15 ఈ జిల్లాలోనే ఉంటాయని సమాచారం. ఎక్కడా కూడా ఇక లైట్ తీసుకోవద్దని భావిస్తున్నారు. ఈ ప్రాంతాలకు భారీగా వైద్యులను పోలీసులను పంపిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news