ఈ రోజుతో నాకు చాలా అనుబంధం ఉంది.. : చిరు

-

ఇటీవల సోషల్‌ మీడియాలోకి ఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్‌ చిరంజీవి.. చాలా యాక్టివ్‌గా ఉంటున్న సంగతి తెలిసిందే. అయితే ఏప్రిల్‌ 8వ తేదీతో తనకు ఎంతో అనుబంధం ఉందని.. చిరు రెండు రోజుల క్రితం ట్వీట్‌ చేసిన సంగతి తెలిసిందే. దీంతో అదేమిటా అని అభిమానులు ఆసక్తితో ఎదురుచూశారు. తాజాగా అందుకు సంబంధించిన వివరాలను మెగాస్టార్‌ వెల్లడించారు. ఆంజనేయస్వామితో తన బంధాన్ని గుర్తుచేసుకున్న మెగాస్టార్‌.. తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనలను అభిమానులతో పంచుకున్నారు. అలాగే హనుమాన్‌ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

‘ఈ రోజు హనుమజ్జయంతి. ఆంజనేయస్వామి తో నాకు చాలా అనుబంధం ఉంది…చిన్నప్పటి నుంచి…1962 లో నాకు ఓ లాటరి లో ఈ బొమ్మ వచ్చింది..అప్పటి నుంచి ఇప్పటి దాకా ఆ బొమ్మ నా దగ్గర అలాగే భద్రంగా ఉంది..ఉంది అని చెప్పటం కంటే దాచుకున్నాను అని చెప్పటం కరెక్ట్. కారణం ఏంటో తెలుసా?.. ఆ రోజు నా చేతిలో ఆ బొమ్మ చూసి మా నాన్న గారు, “ఆ కనుబొమ్మలు, కళ్ళు, ముక్కు అచ్చం నీకు అలానే ఉన్నాయి” అన్నారు. అప్పటి నా ఫోటో.

కొన్ని దశాబ్దాల తరవాత, 2002 లో, బాపుగారు నా ఇంట్లో పెట్టుకునేందుకు నాకు ఇష్టమైన ఆంజనేయస్వామిని చిత్రించి పంపుతాను అన్నారు. నేను అది పాలరాతి మీద చేయించి పూజ గదిలో పెట్టుకున్నాను. ఈ బొమ్మ నాకు ఇచ్చేటప్పుడు ఆయన ఏమన్నారో తెలుసా?.. బాపు గారు చెప్పిన మాట “ఏంటోనండి …బొమ్మని గీస్తుంటే మీ పోలికలే వచ్చాయండి …అలానే ఉంచేసాను …మార్చలేదు ” అన్నారు. చిత్రకారుల ఊహలో స్వామివారి పోలికలు నాకు ఉండటం చిత్రమే. అందరికి హనుమజ్జయంతి శుభాకాంక్షలు. ఇవ్వాల్టి తారీఖుతో కూడా నాకు అనుబంధం ఉంది’ అని చిరంజీవి ట్వీట్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news