తెలంగాణలో వెయ్యి కోట్ల పెట్టుబడులు.. రానున్న 30వేల ఉద్యోగాలు.

-

తెలంగాణ టెక్స్ టైల్ రంగానికి మరింత ఊతమివ్వడానికా అన్నట్టు కేరళకి చెందిన ప్రఖ్యాత కైటెక్స్ గార్మెంట్స్ లిమిటెడ్ ముందుకు వచ్చింది. వరంగల్ లో ఉన్న కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుని సందర్శించిన కైటెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ సబు ఎమ్ జాకోబ్, వెయ్యికోట్ల పెట్టుబడులు పెడతామని ముందుకు వచ్చారు. మొదటి దశలో భాగంగా వెయ్యికోట్ల పెట్టుబడులు పెడతామని, ఆ తర్వాత ఆ పెట్టుబడులను మరింత పెంచుతామని మాట్లాడారు.

ఈ విషయమై తెలంగాణ మంత్రి కేటీఆర్ తో చర్చించన సబు, తెలంగాణలో టెక్స్ టైల్ రంగం వేగంగా అభివృద్ధి చెందుతుందని ప్రశంసించారు. దుస్తుల తయారీ రంగంలో పేరున్న కైటెక్స్, కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లో సంస్థలు నిర్వహిస్తుంది. తెలంగాణ రాష్ట్రాన్ని మరిన్ని ఎక్కువసార్లు సందర్శిస్తానని కైటెక్స్ మేనేజింగ్ డైరెక్టర్ పేర్కొన్నారు. ప్రస్తుత పెట్టుబడులతో దాదాపు 30వేల మందికి ఉపాధి దొరుకుతుందని అంచనా వేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news