ఏడాదిన్నర కాలంగా కరోనా రక్కసి పీడిస్తునే ఉంది. మొదటి వేవ్ తోనే పోయిందనుకుంటే రెండవ వేవ్ తో విజృంభించి ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఆ కారణంగా అందరికీ మూడవ వేవ్ భయం పట్టుకుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కేసులు తగ్గుతున్నాయి. 50వేల దిగువకు కేసుల సంఖ్య చేరింది. తెలంగాణలోనూ కేసుల సంఖ్య చాలా తగ్గింది. ఐతే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, కరోనా నియంత్రణపై సమీక్షా సమావేశం నిర్వహించారు.
అందులో భాగంగా కరోనా ప్రభావిత ప్రాంతాల్లో జ్వర సర్వే నిర్వహించాలని అధికారులకు ఆదేశించారు. ఇతర రాష్ట్రాల్లో కరోనా కేసులు వస్తున్న నేపథ్యంలో మూడవ వేవ్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని, అందువల్ల జ్వర సర్వే నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసారు. ఢిల్లీ, మహారాష్ట్ర, బెంగాల్ సహా ఇతర రాష్ట్రాల్లో కరోనా స్థితిగతులను, నియంత్రణ చర్యలను అధ్యయనం చేయాలని సూచించారు.