ధావత్ తెచ్చిన తంటా..ఏకంగా 103 మందికి ?

-

ఒక అపార్ట్‌మెంట్‌లో పార్టీ ఆ అపార్ట్మెంట్ వాసుల కొంప ముంచింది. పెద్ద ఎత్తున హంగామా చేస్తూ గడపగా ఆ తర్వాత అపార్ట్‌మెంట్‌లో ఉన్న 103 మందికి కోవిడ్ పాజిటివ్ అని తేలింది. దీంతో అపార్ట్‌మెంట్‌ మొత్తం క్వారంటైన్‌లోకి వెళ్లి పోవాల్సిన పరిస్థితి. వివరాల్లోకి వెళితే బెంగళూరులోని బొమ్మనహల్లిలో ఓ అపార్ట్‌మెంట్‌ ప్రాంగణంలో ఫిబ్రవరి నాలుగున ఒక భారీ ఈవెంట్ జరిగింది. ఆ పార్టీలో అపార్ట్‌మెంట్‌ వాసులందరూ పాల్గొన్నారు. వారిలో కొందరు డెహరాడూన్ ట్రిప్‌కు వెళ్లేందుకుగానూ కరోనా టెస్టులు చేయించుకున్నారు.

ఫిబ్రవరి పదిన టెస్టుల ఫలితాలు వచ్చాయి. వారిలో చాలా మందికి కరోనా పాజిటివ్‌గా తేలడంతో వెంటనే అప్రమత్తమైన అపార్టుమెంట్‌ వెల్ ఫేర్‌ కమిటీ సభ్యులు అధికారులకు సమాచారమిచ్చారు. వారు బీబీఎంపీ అధికారులను సంప్రదించి అపార్టుమెంటు వాసులందరికీ కరోనా టెస్టులు చేయించారు. ఆ అపార్టుమెంటులో ఉన్న 1052 మందికి పరీక్షలు చేయగా 103 మంది కరోనా పాజిటివ్‌ అని తేలింది. వారిలో 96 మంది అరవై ఏళ్లకు పైబడిన వారేనని తేలింది. పాజిటివ్‌ వచ్చిన వారిలో ఒకరు ఆస్పత్రిలో చేరగా మిగతా వారిని ఐసోలేషన్‌లో ఉంచారు. అపార్ట్‌మెంటులో ఉన్న అందర్నీ క్వారంటైన్‌ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news