కేరళకు చెందిన 105 ఏళ్ల ముత్తమ్మ 4వ తరగతి పరీక్షను క్లియర్ చేసి దేశంలోని పురాతన విద్యార్థిగా గుర్తించబడింది. గత గత ఏడాది కొల్లం వద్ద రాష్ట్ర అక్షరాస్యత మిషన్ నిర్వహించిన పరీక్షకు ఈ బామ్మ హాజరయ్యారు. ఆ ఫలితాలను అక్షరాస్యత మిషన్ బుధవారం ప్రకటించింది. తన తల్లి మరణం తర్వాత ఆ బామ్మ తన చెల్లెళ్ళను చూసుకోవడానికి చదువు మానేసింది.
వివాహం తరువాత, ఆమె ముప్పై ఏళ్ళ వయసులో ఆమె భర్త కన్నుమూశారు దీనితో అప్పుడు తన ఆరుగురు బిడ్డల బాధ్యత ఆమెపై పడింది. పరీక్షల సమయంలో ఆమె కొంత ఇబ్బందులు పడింది. పర్యావరణం, గణితం మరియు మలయాళానికి సంబంధించిన 3 ప్రశ్నపత్రాలను పూర్తి చేయడానికి ఆమె మూడు రోజులు పట్టింది, ఆమె వయస్సు కారణంగా అక్షరాస్యత మిషన్ అంగీకరించింది.
9 సంవత్సరాల వయస్సు తర్వాత తన చదువును విడిచిపెట్టి ఇప్పుడు తన విద్యను కొనసాగించారు. 275 మార్కులకు గాను 205 మార్కులు సాధించారు. ఇక మ్యాథ్స్ లో పూర్తి మార్కులు సాధించి ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం ఆమెకు ఆరుగురు పిల్లలు కాగా 15 మంది మనవరాళ్ళు ఉన్నారు. వారిలో ముగ్గురు మరణించారు. మరో 12 మంది ముని మనవళ్ళు ఉన్నారు. అక్షరాస్యత మిషన్ డైరెక్టర్ పి ఎస్ శ్రీకళ ఆ బామ్మ గారి ఇంటికి వెళ్లి మరీ ఆమెను అభినందించారు.