మునుగోడు ఉప ఎన్నిక.. 11 నామినేషన్లు దాఖలు

-

నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నికల నామినేషన్ల పర్వం కొనసాగుతున్నది. సోమవారం 11 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌రెడ్డి మూడు సెట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి పాల్వాయి స్రవంతి ఒక సెట్‌ నామినేషన్‌ పత్రాలను అధికారులకు సమర్పించారు. మిగతా నామినేషన్లను స్వతంత్ర అభ్యర్థులు దాఖలు చేయగా.. ఇప్పటి వరకు 17 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మునుగోడు ఉప ఎన్నికల కోసం ఈ నెల 7న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. ఈ నెల 14తో నామినేషన్ల దాఖలకు గడువు ముగియనున్నది. నవంబర్‌ 3న ఎన్నికలకు పోలింగ్‌ జరుగనుండగా.. 6న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.

munugode bypoll: former mla kusukuntla prabhakar reddy to contest as trs  candidate from munugode | Munugode Bypoll: మునుగోడులో రెడ్డి వర్సెస్  రెడ్డి..టీఆర్ఎస్ అభ్యర్థి ఎవరంటే..! News in Telugu

నామినేషన్ అనంతరం రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ భవిష్యత్తును మునుగోడు ఉప ఎన్నిక నిర్దేశిస్తుందని అన్నారు. మునుగోడులో తనపై ఎవరు పోటీకి వస్తారో రావాలని సవాల్ విసిరారు. కెసిఆర్ వస్తారా? కెటిఆర్ వస్తారా?… ఎవరొచ్చినా విజయం నాదే అంటూ ధీమా వ్యక్తం చేశారు. “లక్షల కోట్ల మేర ప్రజల సొమ్ము దోచుకున్న మిమ్మల్ని వదిలేది లేదు… వచ్చే ఏడాది బతుకమ్మ నాటికి కవిత జైలుకెళ్లడం ఖాయం” అని పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికకు ఈ నెల 7న నోటిఫికేషన్ విడుదలైంది. దాంతో నామినేషన్ల పర్వం షురూ అయింది. ఈ నెల 14న నామినేషన్ల దాఖలుకు తుది గడువు. నామినేషన్ల ఉపసంహరణకు ఈ నెల 17వరకు అవకాశం ఇచ్చారు. నవంబరు 3న పోలింగ్, 6వ తేదీన ఫలితాల వెల్లడి ఉంటుంది.

Read more RELATED
Recommended to you

Latest news