నల్గొండ జిల్లాకు రూ.1200 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి ఎర్రబెల్లి పేర్కొన్నారు. మిషన్ భగీరథ కోసం కూడా రాష్ట్రంలో అత్యధికంగా నల్గొండ జిల్లాకు దాదాపు 6వేల కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు ఎర్రబెల్లి. దూరదృష్టి వల్ల వచ్చిన పల్లె ప్రగతి ట్రాక్టర్ల వల్ల గ్రామ పంచాయతీల ఆదాయం గణనీయంగా పెరిగిందని వివరించారు.
కొంతమంది కావాలనే కిస్తిలకు కూడా డబ్బులు అడుగుతున్నారని.. రైతు కళ్ళాలు , రైతు వేదికలు కట్టొద్దు అని కేంద్రం అంటోందని ఫైర్ అయ్యారు. ఉపాధి హామీ పథకం కింద అత్యంత నాణ్యమైన పనులు చేసింది మన రాష్ట్ర ప్రభుత్వమేనని చెప్పారు. మనకు కేంద్రం నుంచి 703 కోట్లు రావాల్సి ఉండగా 150 కోట్లు రైతు కళ్ళాలకు ఖర్చు చేశామని అన్ని నిధులు ఆపారని కేంద్రంపై మండిపడ్డారు. ప్రతి గ్రామానికి రోడ్ల వసతి ఉండాలన్నది సీఎం కేసిఆర్ ఆదేశమని.. అన్ని రోడ్లు వేస్తామని హామీ ఇచ్చారు మంత్రి ఎర్రబెల్లి.