బాలుడు.. సామాన్య బాలుడు కాదు. అసామాన్యుడు. కాళిదాసులాగా, షేక్‌స్పియర్ ఇలా మహా కవులు రాసినట్లు అవలీలగా ఆయా రంగాలకు, ఇతిహాసాలకు సంబంధించిన పుస్తకాలను రాస్తున్నాడు. ఎవరో ఎమిటో తెలుసుకుందాం… ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన మృగేంద్రరాజ్ అనే 12 ఏళ్ల ఓ బాలుడు పుస్తక రచనలో ఆధ్యాత్మికం, ప్రముఖుల జీవిత చరిత్రలను ఆ బాలుడు రాస్తున్నాడు. అద్భుత ప్రతిభను కనబరుస్తున్నాడు. బడికి వెళ్తూ, తోటి విద్యార్థులతో ఆటపాటలతో గడపాల్సిన వయసులో 135 పుస్తకాలు రాశాడు. ఈ బాలుడి ప్రతిభను గుర్తించిన లండన్‌లోని వరల్ రికార్డ్ యూనివర్సిటీ తమ వర్సిటీలో డాక్టరేట్ చేయాలని ఆహ్వానం పంపింది.
తనకు ఆరేళ్ల వయసు ఉన్నప్పటి నుంచే ఆ బాలుడు పుస్తకాలు రాయడం మొదలు పెట్టాడు. మొదటి పుస్తకాన్ని పద్యాల రూపంలో రాశాడు. కొందరు రాజకీయ నాయకుల జీవిత చరిత్రలను కూడా రాశాడు. రామాయణంలోని 51 పాత్రలను విశ్లేషించి కూడా రాజ్ పుస్తకాలు రాశాడు. అతడు చేసిన రచనలన్నీ 25 నుంచి 100 పేజీల పుస్తకాలుగా వెలువడ్డాయి. నేటి అభిమన్యు అనే కలం పేరుతో రచనలు చేస్తున్నాడు. మంచి రచయితగా గుర్తింపు తెచ్చుకోవాలని తాను భావిస్తున్నట్లు ఆ బాలుడు తెలిపాడు. వివిధ అంశాలపై, సాహిత్య ప్రక్రియలపై పుస్తకాలు రాస్తానని చెబుతున్నాడు.
ఇప్పటికే ఆ బాలుడు నాలుగు ప్రపంచ రికార్డులను సొంతం చేసుకున్నాడు. అతడి తండ్రి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి. ఆ బాలుడి తల్లి సుల్తాన్‌పూర్‌లోని ఓ ప్రయివేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు. తన కుమారుడికి రచనలపై ఉన్న ఆసక్తిని గుర్తించి ప్రోత్సహించారు. భవిష్యత్‌లో ఇంకెన్ని మంచి పుస్తకాలను రాయనున్నాడో వేచిచూద్దాం. అతని మేధస్సుకు హ్యాట్సాఫ్.