ఇవాళ సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ కు మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తదితరులు హాజరుకాగా… 2014 నుంచి 2019 వరకు ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం అందివ్వాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
ఏపీ సీఎం జగన్ ఏం చేసినా సంచలనమే. సడెన్ గా ఉంటాయి ఆయన నిర్ణయాలు. వాటిని ఎవ్వరూ ఊహించలేరు కూడా. తను ఏపీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక ఇప్పటికే పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న జగన్.. తాజాగా ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకునేందుకు ఓ చట్టాన్ని తీసుకురాబోతున్నారు.
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబానికి 7 లక్షల పరిహారం ఇవ్వడమే కాదు.. వాళ్లకు ఇచ్చే పరిహారాన్ని వేరే వాళ్లు తీసుకోలేని విధంగా చట్టాన్ని తీసుకువస్తున్నారు. దీని వల్ల లబ్ధిదారులకే ఫలాలు అందనున్నాయి.
ఇవాళ సచివాలయంలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్స్ కు మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, సీఎస్ ఎల్వీ సుబ్రమణ్యం తదితరులు హాజరుకాగా… 2014 నుంచి 2019 వరకు ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం అందివ్వాలని సీఎం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
జిల్లా క్రైం రికార్డ్స్ బ్యురో ప్రకారం.. 1513 మంది రైతులు 2014 నుంచి 2019 మధ్య కాలంలో ఆత్మహత్య చేసుకున్నారు. కానీ.. వారిలో 391 కుటుంబాలకే పరిహారం అందింది. రికార్డుల్లో కూడా అదే ఉంది. గత ప్రభుత్వం ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను పట్టించుకోలేదు అనడానికి ఈ ఘటనే ఉదాహరణ. జిల్లాలలోని డేటాను పరిశీలించి… అర్హులు ఉన్న రైతు కుటుంబాలు ఉంటే వారికి వెంటనే పరిహారం అందివ్వండి. ఈ కార్యక్రమంలో ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేలు కూడా పాల్గొనండి. ఇప్పటి నుంచి రైతు కుటుంబాల్లో జరగరానిది ఏదైనా జరిగితే వెంటనే కలెక్టర్ స్పందించాలని జగన్ కోరారు.