డక్‌వర్త్‌ లూయిస్‌ ప్రకారం ఇండియా టార్గెట్‌.. 60-70 పరుగులు చేసినా గెలుపు మనదే

-

ఉత్కంఠభరితంగా సాగుతున్న ఇండియా న్యూజిలాండ్‌ మ్యాచ్‌ వర్షం కారణంగా ఈ రోజు (జూలై 10)కి వాయిదా పడిన విషయం తెలిసిందే. కివీస్‌ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. ఈ రోజు గనక కివీస్‌ బ్యాటింగ్‌ చెయ్యడం కుదరకపోతే డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్దతి ప్రకారం భారత్‌ టార్గెట్‌ ఎంత? అనేది సగటు ప్రేక్షకుడికి ప్రశ్న. ఈ డక్‌ వర్త్‌ లూయిస్‌ పద్ధతి క్రికెట్‌ ఆటగాళ్లకే సరిగా అర్థంకాదు. మరి సామాన్య ప్రేక్షకుల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాలా.?

ఛాంపియన్స్‌ ట్రోఫిలో ఇండియా రెండు మ్యాచుల్లో డక్‌ వర్త్‌ నిబంధన ప్రకారం ఓడిపోయింది. ధోనీ కూడా డ‌క్‌వ‌ర్త్ లూయిస్ మెథ‌డ్‌పై విరుచుకుప‌డ్డాడు. అస‌లు ఐసీసీకైనా ఈ ప‌ద్ధ‌తి అర్థ‌మ‌వుతుందా అని నిల‌దీశాడు. వ‌ర్షం ప‌డిన సంద‌ర్భంలో ఈ ప‌ద్ధ‌తి ప్ర‌కారమే అంపైర్లు లెక్క‌లు వేస్తుంటారు. అయితే ఈ లెక్క‌లు అర్థం కాక కెప్టెన్లు త‌ల ప‌ట్టుకుంటున్నారు. అంటూ ధోనీ ఘాటుగానే స్పందించాడు.


అయితే కామెంటేటర్‌ హర్షా బోగ్లే తన ట్విట్టర్లో ఇండియా విజయానికి ఎన్ని ఓవర్లలో ఎన్ని పరుగులు చేయాలో చెబుతూ ట్వీట్ చేశాడు.
డక్ వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం ఇండియా టార్గెట్ 46 ఓవర్లలో 237 పరుగులు కానుంది. 20 ఓవర్లు మాత్రమే సాధ్యపడితే.. కోహ్లిసేన విజయం కోసం 148 పరుగులు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ 46 ఓవర్ల మ్యాచ్ కొనసాగించడానికి అంపైర్లు నిర్ణయించి.. 20 ఓవర్లలో భారత్ వికెట్ నష్టపోకుండా 60-70 పరుగులు చేసిన టైంలో వర్షం పడితే.. విజయం వరించేది భారత్‌ నే..

Read more RELATED
Recommended to you

Latest news