పండుగ పూట దారుణం : భార్యాభర్తలు ఇద్దరూ సజీవదహనం !

పండుగ పూట తెలంగాణలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలం లింగంపల్లి గ్రామంలో 40 ఏళ్ళ చాకలి ఎల్లేష్ 35 ఏళ్ళ చాకలి సునీతలు భార్య భర్తలు. ఈ ఇద్దరు సజీవ దహనం అయి చనిపోయారు. వివరాల్లోకి వెళ్తే ఎల్లేష్ మద్యానికి బానిస అవ్వడంతో భార్య సునీత భర్తను గతంలో అనేక సార్లు హెచ్చరించింది. భర్తను మద్యం మానేయమని పలుమారు ఆత్మహత్య ప్రయత్నం చేసింది. కానీ భర్తను మద్యం మానకుండా చేయలేక పోయింది.

fire
fire

నిన్న రాత్రి భర్త ఎల్లేష్ మద్యం సేవించి రావడంతో భార్య తలుపులు బిగించి కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. భర్త భార్యను కాపడబోగా ఇద్దరికీ మంటలు అంటుకున్నాయి. 14 ఏళ్ళ వీరి కుమార్తె తల్లి తండ్రులు మంటల్లో కాలిపోతుండడం చూసిన మంచం కింద దాక్కుని అరుపులు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు వచ్చారు. వచ్చి బిగించిన తలుపులు తొలగించి ఆత్మహత్య పాల్పడ్డ దంపతులను 108 ద్వారా సంగారెడ్డి ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఒకరు సంగారెడ్డి హాస్పిటల్ లో మరొకరు హైదరాబాద్ హాస్పిటల్ లో మృతి చెందారు.