భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఈనెల 16న వీడియో రిమోట్ లింక్ ద్వారా ప్రారంభించనున్న నాగపూర్-సికింద్రాబాద్ వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైల్లో మొత్తం 1,440 సీట్లు ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే వెల్లడించింది. మహారాష్ట్రతో తెలంగాణను అనుసంధానం చేస్తున్న తొలి వందేభారత్ ఎక్స్ ప్రెస్ ఇదే కావడం విశేషం.
ఇప్పటికే నడుస్తున్న సికింద్రాబాద్- బెంగళూరు వందేభారత్ లో 8 కోచ్ లు కాగా.. విశాఖపట్నం, తిరుపతి వందేభారత్ ఎక్స్ ప్రెస్ లో ఈ సంఖ్య 16. ఇక నాగపూర్- సికింద్రాబాద్ వందేభారత్ లో 20 కోచ్ లు ఉంటాయని.. దక్షిణ మధ్య రైల్వేలో ప్రయాణించే వందేభారత్ రైళ్లలో ఇదే అతి పెద్దదని దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది. ఇందులో రెండు ఎగ్జిక్యూటివ్, 18 చైర్ కార్ కోచ్లు ఉంటాయని వివరించింది. ఇక ఛార్జీల వివరాలను మాత్రం వెల్లడించలేదు. ‘కవచ్ భద్రతా సౌకర్యంతో పాటు వై-ఫై, ఎల్ఎస్ఈడీ లైటింగ్ బయో వ్యాక్యూమ్ టాయిలెట్లు వంటి సౌకర్యాలు ఉంటాయి’ అని పేర్కొంది.