గోల్డ్ కొనుగోలు చేసేవారికి బిగ్ షాక్ అనే చెప్పాలి బంగారం ధర..భారీగా పెరిగింది. గత రెండు రోజుల నుంచి ధరలను పరిశీలిస్తే తులం బంగారంపై దాదాపు రూ.1500 పైగా ఎగబాకింది. తాజాగా సెప్టెంబర్ 15వ కూడా భారీగానే పెరిగింది. ఈ ప్రపంచంలోనే అత్యంత విలువైనది బంగారం. బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. మన దేశంలో అయితే.. దీనికి ఉన్న డిమాండ్ మరీ ఎక్కువే. ఏ చిన్న పండగ జరిగినా.. బంగారం, వెండి కొనుగోలు చేయడానికి మహిళలు ఎంతో ఆసక్తి చూపిస్తుంటారు.
హైదరాబాద్ నగరంలో బంగారం, వెండి ధరల వివరాల్లోకి వెళితే… హైదరాబాద్ మార్కెట్ లో ఇవాళ 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 74, 890 గా నమోదు కాగా… అదే సమయం లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 68, 650 గా పలుకుతుంది. బంగారం బాటలో వెండి కొనసాగుతుంది. రెండు రోజుల కిందట 84,000 ఉన్న వెండి ధర.. ప్రస్తుతం రూ.92,000లకు చేరుకుంది. కొన్ని ప్రాంతాల్లో భారీగానే ఉంది. చెన్నై, హైదరాబాద్, కేరళ రాష్ట్రాల్లో మాత్రం కిలో వెండి ధర రూ.97,000లకు చేరుకోవడం విశేషం.