రైతుల అకౌంట్ లోకి రూ.15 లక్షలు..!

-

కేంద్రం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. రైతుల కోసం కూడా కేంద్రం ఎన్నో స్కీమ్స్ ని తీసుకు వచ్చింది. రైతుల ఆదాయాన్ని రెట్టింపు చెయ్యడానికి కేంద్రం చూస్తోంది. అయితే రైతుల కోసం కేంద్రం పీఎం కిసాన్‌ సమ్మాన్ యోజన పథకం ని కూడా తీసుకు వచ్చింది.

అలానే మరో స్కీమ్ ని కూడా కేంద్రం అందిస్తోంది. ఏకంగా రూ.15 లక్షలను ఇస్తోంది. ఇక పూర్తి వివరాలని చూస్తే.. కిసాన్ యోజన కింద గతంలో రూ.6వేలు ఇస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కొత్తగా వ్యవసాయ వ్యాపారం ప్రారంభించడానికి రైతులకు రూ.15 లక్షలు ని ప్రభుత్వం ఇస్తోంది. ఈ పథకం కింద ఫార్మర్స్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్‌కు ప్రభుత్వం రూ.15 లక్షలు ఇస్తుంది. 11 మంది రైతులు కలిసి ఒక సంస్థ లేదా కంపెనీని ఏర్పాటు చేసుకోవాలి. ఎలా పొందచ్చనేది చూసేద్దాం.

నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌కి వెళ్ళాలి.
FPO మీద క్లిక్ చేసేసి… రిజిస్ట్రేషన్ ని సెలెక్ట్ చెయ్యండి.
రిజిస్ట్రేషన్ ఫారమ్‌లో అడిగిన సమాచారాన్ని ఇచ్చేసి… పాస్‌బుక్ లేదా రద్దు చేయబడిన చెక్కు, ID రుజువును స్కాన్ చేసిన తరవాత వాటిని అప్‌లోడ్ చేసి సబ్మిట్ చెయ్యండి.

ఇలా ఈజీగా లాగిన్ అవ్వచ్చు:

నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ అధికారిక వెబ్‌సైట్‌ లోకి వెళ్లి.. FPO మీద క్లిక్ చేయండి.
ఇప్పుడు లాగిన్ మీద క్లిక్ చేసి పేరు పాస్‌వర్డ్, క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేస్తే సరిపోతుంది.

Read more RELATED
Recommended to you

Latest news