ఢిల్లీ : తాలిబాన్ల బందీ లో ఉన్న భారతీయులు సురక్షితంగా బయటపడ్డారు. వారిని సాధ్యమైనంత త్వరలో భారత్ కు తరలించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. భారతీయులను తరలించేందుకు కాబూల్ విమానాశ్రయం లో భారత వైమానిక దళానికి చెందిన ప్రత్యేక విమానం సిధ్దంగా ఉంది.
కాబూల్ విమానాశ్రయం వద్ద సుమారు 150 మంది భారతీయతలను బందీలు గా చేసిన తాలిబాన్లు… విమానాశ్రయం నుంచి సమీపంలో ఉన్న పోలీసు స్టేషన్ కు ట్రక్కులలో తరలించారు. ప్రయాణ పత్రాలు, గుర్తింపు కార్డులను పరీశించిన తాలిబాన్లు…చివరికి వారిని వదిలిపెడుతున్నట్లు ప్రకటించారు. ఇంకా సుమారు 1000 మంది ఆప్ఘనిస్తాన్ లో భారతీయులు ఉన్నట్లు సమాచారం అందుతోంది. అయితే చాలా మంది భారత దౌత్య కార్యాలయం వద్ద తమ పేర్లను నమోదు చేసుకోని భారతీయులు అక్కడే చిక్కున్నట్లు తెలుస్తోంది. దీంతో ఏ ఏ ప్రాంతాలలో ఉంటున్నారో, ఆయా ప్రాంతాలు సురిక్షితమేనా ? లేదా ? అనే సమాచారాన్ని సేకరిస్తున్నారు భారతదేశ అధికారులు.