హుజురాబాద్‌లో నిశ్శబ్దం.. అక్కడ అసలు ఏమైంది..?

-

తెలంగాణ రాష్ట్రంలో ఏ ప్రాంతంలోనైనా ప్రస్తుతం హుజురాబాద్ ఉప ఎన్నికలో పార్టీలో గెలుపుపైనా చర్చ జరుగుతున్నది. స్వయంగా సీఎం కేసీఆర్ ఈ బై పోల్‌ను పర్యవేక్షిస్తుండగా, ఈ ప్రాంతంలో రాజకీయ వాతావరణం బాగా హీటెక్కింది. ఓ వైపు అధికార పార్టీ మరో వైపున విపక్ష పార్టీలు పావులు కదుపుతుండటంతో హుజురాబాద్‌లో రాజకీయం ఆసక్తికరంగా మారింది. అయితే, ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని అధిష్టానం ప్రకటించలేదు. దీంతో బీజేపీ, టీఆర్ఎస్ పార్టీలు మాత్రమే ప్రచారంలో దూసుకుపోతున్నాయని చెప్పొచ్చు.

Huzurabad | హుజురాబాద్

ఈ క్రమంలోనే హుజురాబాద్ నియోజకవర్గంలో స‌మావేశాలు, సభలు, పార్టీల్లో చేరిక‌లు, ప్రచారాలు, పాదయాత్రలు అన్నీ హుజురాబాద్‌లో జోరుగా జరుగుతున్నాయి. అయితే, గత కొద్ది రోజులుగా సీఎం సభ తర్వాత హుజురాబాద్‌లో పొలిటికల్ అట్మాస్పియర్ సైలెంట్ అయిపోయింది. హుజురాబాద్ బై పోల్‌కు నోటిఫికేషన్ ఇప్పట్లో వచ్చేట్లు లేదని పొలిటికల్ పార్టీలకు సమాచారం అందినట్లుంది. ఈ నేపథ్యంలోనే రాజకీయ పార్టీలు ఒక్కసారిగా సైలెంట్ అయిపోయాయి. టీఆర్ఎస్ హుజురాబాద్ అభ్యర్థిగా గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను పింక్ పార్టీ అధిష్టానం, ఆయన్ను ఎలాగైనా గెలిపించుకోవాలని చూస్తోంది.

‘దళిత బంధు’ స్కీమ్‌ను సీఎం లాంచ్ చేయగా, గెల్లు తరఫున మంత్రి హరీశ్ ప్రచారం కూడా చేశారు. ఇక ఎలాగైనా తన పంతం నెగ్గించుకోవాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ కూడా ప్రచారం చేస్తున్నారు. కేంద్ర పర్యాటక, సాంస్కృతి, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖ మంత్రి గంగాపురం కిషన్‌రెడ్డి కూడా ఈటల తరఫున ప్రచారం చేశారు. బీజేపీ నేతలు ఈటల గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. పాదయాత్ర నుంచి బ్రేక్ తీసుకున్న ఈటల ప్రస్తుతం జనం వద్దకు వెళ్లి కలుస్తున్నాడు. త్వరలో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ కుమార్ ఈటల తరఫున మళ్లీ ప్రచారం చేయబోతున్నట్లు బీజేపీ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Exit mobile version