52 ఏళ్ళ వయసులో ఓ మహిళా ఏకంగా 150 కిలో మీటర్లు ఈతకొట్టి రికార్డు సృష్టించగా.. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఆమెపై ప్రశంసల వర్షం కురిపించారు. ప్రధానంగా శ్యామల అనే 52 ఏళ్ల మహిళా.. ఒడిస్సీ ఓషన్ స్విమ్మింగ్ సంస్థ ఆధ్వర్యంలో గత నెల 28న శ్యామల సాహసయాత్ర ప్రారంభించింది. ఇందులో భాగంగా.. విశాఖ సముద్ర తీరం నుండి కాకినాడ తీరం వరకు రోజుకు 30 కిలోమీటర్ల చొప్పున 150 కి.మీ. ఈదుకుంటూ.. శుక్రవారం గ్రామీణం సూర్యారావుపేట తీరానికి చేరుకుని రికార్డు సృష్టించింది. మహిళపై సాహసయాత్రపై సీఎం చంద్రబాబు నాయుడు స్పందిస్తూ.. ట్విట్టర్ వేదికగా శ్యామలపై ప్రశంసలు కురిపించారు.
“52 సంవత్సరాల వయస్సులో గోలి శ్యామల 150 కిమీ విజయవంతంగా విశాఖపట్నం నుంచి కాకినాడ వరకు ఈదడం ఒక అసాధారణ ధైర్యం, సంకల్పం గాథ. ఆరు రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ బిడ్డ అనేక సవాళ్లను ఎదుర్కొని.. ధైర్యం తో జయించగలిగింది. ఆమె ప్రయాణం కేవలం నారీ శక్తి యొక్క ప్రకాశనమైన ఉదాహరణ మాత్రమే కాకుండా, మానవ ఆత్మ, శక్తి ప్రతిబింబం కూడా. సముద్ర జీవనాన్ని రక్షించే అవసరాన్ని కూడా గుర్తు చేసింది”అని సీఎం చంద్రబాబు ట్వీట్ లో రాసుకొచ్చారు.