పోస్ట్ ఆఫీస్ స్కీమ్.. రూ. 333 పొదుపుతో రూ.16 లక్షలు..!

-

చాల మంది ఈ మధ్య ఎవరికి నచ్చిన స్కీమ్స్ లో వాళ్ళు డబ్బులు పెడుతున్నారు. ఈ స్కీమ్స్ లో డబ్బులు పెట్టడం వలన చక్కటి లాభాలని పొందొచ్చు. పోస్ట్ ఆఫీస్ కూడా ఎన్నో రకాల స్కీములని తీసుకు వచ్చింది. పోస్ట్ ఆఫీస్ స్కీముల్లో డబ్బులు పెడితే చక్కటి లాభాలని పొందడానికి అవుతుంది. పోస్టాఫీస్ RD అకౌంట్‌ను ఓపెన్ చేసి చక్కటి లాభాలని పొందొచ్చు. ఇక దీని కోసం పూర్తి వివరాలని చూస్తే.. పోస్టాఫీస్ RD అకౌంట్‌ను ఎంతో ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. 10 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ కూడా పోస్టల్ ఆర్డీ అకౌంట్ ని తీసుకోవచ్చు.

రూ. 100 ఇందులో ఇన్వెస్ట్ చేస్తే చాలు. ప్రతి నెలా కాంట్రిబ్యూషన్‌ను రూ.10 మల్టిపుల్స్‌లో ఎంతైనా పెంచుకుంటూ వెళ్ళచ్చు. డిపాజిటర్లు 5.8 శాతం వడ్డీ వస్తుంది. ఈ వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. మూడు నెలలకి ఒకసారి మారుతాయి. అకౌంట్ తెరిచిన తేదీ నుంచి ఐదు సంవత్సరాలు లేదా 60 నెలల్లో ముందు వచ్చేది మెచ్యూరిటీగా తీసుకుంటారు. ఇది ఐదేళ్లు అయినా ఇంకో ఐదేళ్లు ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. అలానే ఈ అకౌంట్ ఓపెన్ చేసాక ఏడాది తర్వాత డిపాజిటర్లు డిపాజిట్ బ్యాలెన్స్‌లో 50 శాతం దాకా విత్‌ డ్రా చెయ్యచ్చు. అకౌంట్ ఓపెన్ చేసిన ఒక సంవత్సరం తర్వాత డిపాజిటర్లు 50 శాతం దాకా లోన్ తీసుకోవచ్చు. ఈ లాభం కూడా వుంది ఈ స్కీమ్ తో.

ప్రభుత్వ మద్దతు కూడా ఉంటుంది. డిపాజిట్లు, వాటిపై అందే వడ్డీ రాబడికి ప్రభుత్వం హామీ ఉంటుంది. రిస్క్ కూడా తక్కువే దీని వలన. తక్కువ అమౌంట్ తో మీరు స్కీమ్ లో ఇన్వెస్ట్ చెయ్యాలని అనుకుంటే ఇది మంచిది. ప్రతి నెలా రూ. 10,000 లేదా రోజుకు రూ. 333 పెట్టుబడి పెడితే చక్కటి బెనిఫిట్ ఉంటుంది. పోస్టల్ ఆర్డీలపై చక్రవడ్డీ వస్తుంది. ఇన్వెస్టర్లు పదేళ్ల తర్వాత దాదాపు రూ.16 లక్షల రాబడిని ఈ స్కీమ్ తో పొందొచ్చు. రూ.12 లక్షలు మీరు పదేళ్లకు పెడతారు. ఈ స్కీమ్ లో రాబడి రూ. 4.26 లక్షలుగా వుంది.

Read more RELATED
Recommended to you

Latest news