పోలీస్ స్టేషన్ లో మకాం వేసిన 16 నాగరాజులు

-

హిమాచల్ ప్రదేశ్, ధర్మశాలలోని గగ్గల్ పోలీస్ స్టేషన్​లో 16 నాగుపాములు పట్టబడ్డాయి. పోలీస్ స్టేషన్​లో ఓ నాగుపాము కనిపించింది. అయితే, అదే రోజు పాములు పట్టేవారు వచ్చి నాగును తీసుకెళ్లారు. దీంతో, ఇక పాము భయం పోయిందనుకున్నారు అంతా. కానీ, ఓ ఉద్యోగి మాత్రం స్టేషన్​లో ఇంకో పాము ఉన్నట్లు అనుమానించాడు. స్టేషన్ ఇన్-ఛార్జ్ మహర్దీన్ పాములు పట్టేవారిని మళ్లీ పిలిపించారు. వారు స్టేషన్ నలుమూలలూ వెతికారు. అనుమానమే నిజమైంది. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 16 బాల నాగులు వారి కంటబడ్డాయి.

ఒక్కోటి దాదాపు ఒకటిన్నర అడుగుల పొడవున్న పిల్లనాగులన్నీ ఒకే తల్లి బిడ్డలుగా గుర్తించారు. వాటిని డబ్బాల్లో బంధించి పట్టుకెళ్లారు. ఆపై అడవిలో వదిలేశారు. వాటిని గుర్తించకుండా వదిలి ఉంటే ఎంతమందికి ప్రమాదం జరిగేదో తెలీదు.. ఎందుకు అంటే నిత్యం ఆ పరిసర ప్రాంతాల్లో అనేక మంది సంచరిస్తూ ఉంటారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version