తెలంగాణ రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ ఢిల్లీలో ఆర్&బీ స్పెషల్ సెక్రెటరీ హరిచందన ఐఏఎస్ తో కలిశారు. అనంతరం జాతీయ రోడ్డు రవాణా మరియు జాతీయ రహదారుల (మోర్త్) శాఖ కార్యదర్శి శ్రీ అనురాగ్ జైన్ తో సమావేశం కావడం జరిగింది. “ఆర్ఆర్ఆర్ రోడ్డు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అనురాగ్ జైన్ కు విన్నవించాను. నల్గొండ బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని త్వరగా చేపట్టేందుకు ఎస్ఆఫ్ సీ (స్టాండింగ్ ఫైనాన్స్ కమిటీ) మీటింగ్ ఏర్పాటు చేసి త్వరగా టెండర్లు పిలవాలని కోరడం జరిగింది.
రాష్ట్రంలో 16 రాష్ట్ర రహదారులను.. జాతీయ రహదారులుగా మార్చే ప్రతిపాదనలపై త్వరగా నిర్ణయం తీసుకోవాలని కోరాను. నల్గొండ బైపాస్ నిర్మాణంపై వారంలో ఎస్ఎఫ్ సీ ఏర్పాటు చేస్తామని అనురాగ్ జైన్ గారు హామీ ఇచ్చారు.. వీటితోపాటు ఆర్ఆర్ఆర్, 16 జాతీయ రహదారుల అప్ గ్రేడేషన్ పై ప్రక్రియను ప్రారంభిస్తామని వారు చెప్పడం జరిగింది” అంటూ ట్వీట్ చేశారు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి.