రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణకి 16 పార్టీల నిర్ణయం..

-

బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా రేపు ఉభయసభలను ఉద్దేశించి రాష్ట్రపతి‍ రామ్‌నాథ్‌ కోవింద్‌ చేయనున్న ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు 16 ప్రతిపక్ష పార్టీలు నిర్ణయం తీసుకున్నాయి. వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్  చేస్తూ ప్రతిపక్షం లేకుండా చేసి, ఏకపక్షంగా చట్టాలను ఆమోదించుకున్నారని అ పదహారు పార్టీలు ఆరోపిస్తున్నాయి. కొత్త చట్టాల వల్ల ఆహర భద్రతకు ముప్పు కలుగుతుందని, ఆహార ధాన్యాలను ప్రభుత్వం సేకరించడం నిలిచిపోయి, ప్రజా పంపిణీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని విమర్శించారు.

ram nath kovind orders to home ministries for telangana inter students suicide report

అందుకే రెండు నెలలకు పైగా  వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ రైతులు ఆందోళన చేస్తున్నారు. ఆందోళనల్లో మొత్తం 155 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని జనవరి 26 నాటి హింసాత్మక ఘటనలు ఖండనీయంమని పేర్కొంటూ 16 పార్టీలు ప్రకటన చేశాయి. ఈ దుశ్చర్యల వెనుక అసలు కుట్రదారులెవరో తేల్చాల్సిన అవసరం ఉందని ఇందుకోసం నిష్పాక్షికంగా దర్యాప్తు జరపాలని కోరారు. 16 పార్టీలు ఈమేరకు ఉన్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీ, జేకేఎన్సీ, డీఎంకే, తృణమూల్ కాంగ్రెస్, శివసేన, సమాజ్‌వాదీ పార్టీ, ఆర్జేడీ, సీపీఐ(ఎం), సీపీఐ, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్, ఆర్ఎస్పీ, పీడీపీ, ఎండీఎంకే, కేరళ కాంగ్రెస్ (ఎం), ఏఐయూడీఎఫ్

Read more RELATED
Recommended to you

Latest news