రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని తెలిపే సంకేతాలు..

-

కరోనా వచ్చిన తర్వాత రోగనిరోధక శక్తి గురించి అందరికీ తెలిసింది. మహమ్మారి బారి నుండి తప్పించుకోవడానికి పటిష్టమైన రోగనిరోధక శక్తి అవసరం అని అందరూ గుర్తించారు. అందుకే రోగ నిరోధక శక్తిని పెంపొందించే పోషకాహారాలు తీసుకుంటున్నారు. పండ్లు, విటమిన్ సి అధికంగా గల ఆహారాలని తీసుకోవడానికి ఇష్టపడుతున్నారు. ఐతే రోగనిరోధక శక్తి తక్కువగా ఉందని ఏ విధంగా తెలుస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

రోగనిరోధక శక్తి అనేది తెల్లరక్తకణాల ద్వారా తయారవుతుంది. అనేక సూక్ష్మక్రిముల నుండి మన శరీరాన్ని కాపాడడానికి రక్షక కవచంలా పనిచేస్తాయి. రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటే ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయంటే,

అధిక ఒత్తిడి

అధిక ఒత్తిడితో బాధపడుతూ ఉంటే రోగనిరోధక శక్తి తగ్గుతూ వస్తుంది. దీనివల్ల తెల్ల రక్తకణాలు తగ్గిపోతాయి. అప్పుడు జలుబు, డయేరియా వంటి వ్యాధులకి దారి తీస్తుంది.

తరచుగా జబ్బు పడడం

పదే పదే అదే పనిగా జబ్బు పడడం కూడా తక్కుబ రోగనిరోధక శక్తిని సూచిస్తుంది. తెల్ల రక్తకణాల సంఖ్య తగ్గి తరచుగా జబ్బు పడుతూ ఉంటే రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాలు తీసుకోవాలి.

అలసట

ఊరికే అలసిపోవడం కూడా రోగనిరోధక శక్తి తక్కువగా ఉండడం వల్లే కలుగుతుంది. ఎక్కువగా పనిచేయకపోయినా అలసిపోతున్నారంటే ఆలోచించాల్సిందే.

గాయాలు త్వరగా మానవు

గాయాలు త్వరగా మానకుండా చాలా ఆలస్యంగా నయం కావడానికి తక్కువ రోగనిరోధక శక్తే కారణం. చర్మాన్ని తొందరగా ఉత్పత్తి చేయకుండా ఆలస్యం చేసి తద్వారా మనల్ని ఇబ్బందులు పెడుతుంది.

కీళ్ళనొప్పులు

తరచుగా కీళ్ళు నొప్పి పెడుతుంటే అది తక్కువ రోగనిరోధక శక్తికి నిదర్శనం. అందుకే మీకు ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అలక్ష్యం చేయకుండా ఇమ్యూనిటీని పెంచే ఆహారాలని తీసుకోండి.

Read more RELATED
Recommended to you

Latest news