వీధి కుక్క మృతిపై కాలనీవాసుల సంతాప పోస్టర్లు.. ఎక్కడో తెలుసా..?

-

కరోనా సమయంలో ఇంటి సభ్యులు కోవిడ్ బారినపడితేనే దూరం పెట్టేశారు. వారి చనిపోతే అంత్యక్రియలు చేయడానికి కూడా అడుగు ముందుకు వేయని సంఘటనలు ఎన్నో చూశాం. మనుషులకే విలువ లేని నేటి సమాజంలో ఆ విలువ ఓ వీధి కుక్కకు దొరికింది. ఓ వీధి కుక్క చనిపోవడంతో ఆ కాలనీవాసులంతా సంతాపం పాటించారు. ఆ కుక్క చనిపోయిన సంతాప పోస్టర్లు కూడా అతికించి ఘన నివాళిలు అందించారు. ఓ వీధి కుక్కకు ఇంత క్రేజ్ ఏంటీ.. చనిపోతే కాలనీ మొత్తం సంతాపం వ్యక్తం చేయడం కొత్తగా అనిపిస్తోంది కదూ.

dog
dog

కుక్క మరణిస్తే పోస్టర్లు అతికించి సంతాంపం వ్యక్తం చేసిన ఘటన కేరళలోని పథానమ్ తిట్టా జిల్లా మనక్కలలో చోటు చేసుకుంది. వీధికుక్కపై అంత మమకారం ఏంటని ఆ కాలనీ వాసులను ప్రశిస్తే.. తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన రీతిలో బాధపడుతున్నారు. ఆ వీధి కుక్క కాలనీవాసుల ప్రేమను, నలుగురిని సంపాదించుకుందంటే గ్రేట్ అనే చెప్పుకోవచ్చు. కళ్ల ముందు ఆ శునకం ప్రాణాలు విడుస్తుంటే తట్టుకోలేకపోయామని వాపోయారు. కాలనీకి ఎంతో సేవలు అందించిందని, అందుకే ఘన నివాళులు అందించామని కాలనీవాసులు పేర్కొన్నారు.

రాత్రివేళల్లో ఆ శునకం కాలనీకి ఎంతో రక్షణగా నిలిచేదని స్థానికులు చెబుతున్నారు. ఆ కుక్కకు ‘రమణి’ అని పేరు పెట్టి ఎంతో అప్యాయంగా చూసుకునేవారు. నాలుగేళ్లుగా కాలనీలో ఉంటోందని, ఎలాంటి దొంగతనాలు జరగకుండా కాలనీని సంరక్షించేదని స్థానికులు తెలిపారు. కాలనీ జంక్షన్ లో అనేక వ్యాపార సముదాయాలు ఉన్నాయని, రాత్రివేళలో రమణి సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహించేదని వారు పేర్కొన్నారు. కొన్ని రోజుల కిందట రమణికి యాక్సిడెంట్ జరిగిందని, వాహనం ఢీకొని ప్రాణాలు కోల్పోయిందని, ఒకేసారి రెండు వాహనాలు తనపై నుంచి వెళ్లాయని ఆవేదన వ్యక్తం చేశారు. కళ్ల ముందే ప్రాణాలు కోల్పోతున్నా.. కాపాడుకోలేకపోయామని టైర్ల షాపు నిర్వాహకుడు ప్రదీప్ పలారా పేర్కొన్నాడు. ఎవరికీ ఎలాంటి హాని చేయలేదని, రమణి ఉంటే రాత్రిళ్లు ధైర్యంగా నిద్రపోయే వాళ్లమని చెప్పుకొచ్చాడు. కాలనీవాసులందరూ కలిసి అంత్యక్రియలు నిర్వహించామన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news