దంచికొడుతున్న ఎండలు.. పిట్టల్లా రాలిపోతున్న జనాలు.. ఒక్క రోజే 16 మంది మృతి

-

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఒక్కరోజే ఏపీ, తెలంగాణలో వడదెబ్బకు 16 మంది మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా.. 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత నమోదవుతోంది.

అబ్బబ్బ.. ఏం ఎండలురా బాబు. బయట కాలు పెట్టలేకపోతున్నాం. నిప్పుల కొలిమిలా ఉంది ఎండ. ఇది మామూలు ఎండ కాదు. ఈ ఎండలో ఒక్కసారి బయటికి వెళ్తే.. అంటే నీరసం వచ్చేస్తది.. వడదెబ్బ తాకినా తాకొచ్చు. చెప్పలేం. ముఖ్యంగా ఉదయం 10 దాటితే బయటికి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు ప్రజలు. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో అయితే ఉష్ణోగ్రతలు ఒక్కసారిగా పెరిగిపోయాయి.

16 people died in telugu states with summer stroke

ఫొని తుపాను ప్రభావం తగ్గా.. భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఎండ వేడికి తోడు వడగాల్పులు తీవ్రంగా వీస్తుండటంతో వడగాల్పులను తట్టుకోలేక వృద్ధులు మృత్యువాత పడుతున్నారు. మరికొందరు వడదెబ్బకు తాళలేక చనిపోతున్నారు.

వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం ఒక్కరోజే ఏపీ, తెలంగాణలో వడదెబ్బకు 16 మంది మృతి చెందారు. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా.. 45 డిగ్రీలకు పైనే ఉష్ణోగ్రత నమోదవుతోంది.

ఏపీలో అత్యధికంగా కృష్ణా జిల్లాలోని దొనబండలో 46.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది. తెలంగాణలో ఖమ్మం జిల్లా బాణాపురం, పమ్మిలో 46.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయింది.

అంతే కాదు.. ఈ మూడు నాలుగు రోజులు విపరీతమైన ఎండలు కొడుతాయని వాతావరణ శాఖ అధికారులు ముందే హెచ్చరించారు. మే 10 తర్వాత కూడా ఎండల తీవ్రత ఇంకాస్త పెరుగుతుందట. రాయలసీమ, కోస్తాంధ్ర జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే ప్రమాదం ఉందట. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు 47 నుంచి 48 డిగ్రీలకు పెరిగినా ఆశ్చర్యపోవక్కర్లేదని అధికారులు చెబుతున్నారు. కాబట్టి.. అత్యవసరం అయితే తప్ప బయటికి వెళ్లకండి. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్లకు వడదెబ్బ తొందరగా తాకే ప్రమాదం ఉంటుంది. ఎక్కువగా నీళ్లు తాగడం, మజ్జిగ లాంటివి తాగుతూ… బయటికి వెళ్లకుండా చల్లని ప్రదేశాల్లో గడిపేలా ప్లాన్ చేసుకోండి. కనీసం మే పూర్తయ్యే వరకు కాస్త ఎండకు దూరంగా ఉంటే బెటర్. మే నెల వెళ్లిపోతే.. ఎండలు కాస్త తగ్గుముఖం పడతాయి. ఈ ఒక్కనెల జాగ్రత్తగా ఉండాలి.. అని ఆరోగ్య నిపుణులు, వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news