ప్రముఖ మొబైల్ గేమ్ పబ్‌జి మరొకరి ప్రాణాన్ని బలి తీసుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 16 ఏళ్ల బాలుడు పబ్‌జి గేమ్‌ను రోజుల తరబడి ఆడుతూ చనిపోయాడు. ఆ గేమ్‌కు బానిసైన అతను తిండి, నీళ్లు మాని గేమ్‌ను రోజుల తరబడి ఆడుతూనే ఉన్నాడు. కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇంట్లోనే ఉంటున్న అతను పబ్‌జి గేమ్‌లో లీనమైపోయాడు. ఈ క్రమంలోనే రోజుల తరబడి నీళ్లు, ఆహారం కూడా సరిగ్గా తీసుకోలేదు.
అలా గేమ్‌కు బానిసైన అతను చివరకు తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. డీహైడ్రేషన్‌తోపాటు తీవ్రమైన డయేరియా బారిన పడ్డాడు. దీంతో అతన్ని ఏలూరూ టౌన్‌లోని ఓ హాస్పిటల్‌కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. రోజుల తరబడి పబ్‌జి గేమ్‌కు బానిసై తిండి, ఆహారం తగినంత తీసుకోకపోవడం, నిద్ర సరిగ్గా పోకపోవడం వల్లే అతను అనారోగ్యానికి గురై మృతి చెందాడని వైద్యులు తెలిపారు.
కాగా గతంలోనూ పూణెకు చెందిన 25 ఏళ్ల వ్యక్తి కంటిన్యూగా పబ్‌జి ఆడుతూ స్ట్రోక్‌కు గురయ్యాడు. కుడిచేయి, కాలు పక్షవాతానికి గురయ్యాయి. దీంతో అతన్ని హాస్పిటల్‌లో చేర్పించగా… మెదడులో రక్తం గడ్డకట్టి అతను చనిపోయాడు. పబ్‌జి గేమ్ వల్ల నిజానికి తీవ్రమైన అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నా ఇప్పటి వరకు మన దేశంలో ఆ గేమ్‌పై మాత్రం ఇంకా చర్యలు తీసుకోలేదు. మరోవైపు మన పొరుగు దేశాలైన చైనా, పాకిస్థాన్‌లలో మాత్రం ఈ గేమ్‌ను ఇప్పటికే నిషేధించారు.