రూ.6,999కే ఐటెల్ విజ‌న్ 1 ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్‌..!

-

మొబైల్స్ త‌యారీదారు ఐటెల్ భార‌త్‌లో విజ‌న్ 1 పేరిట ఓ నూత‌న స్మార్ట్‌ఫోన్‌ను విడుద‌ల చేసింది. ఇందులో 6.088 ఇంచుల హెచ్‌డీ ప్ల‌స్ రిజ‌ల్యూష‌న్ క‌లిగిన డిస్‌ప్లేను ఏర్పాటు చేశారు. ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 3జీబీ ర్యామ్‌ల‌ను అందిస్తున్నారు. వెనుక వైపు 8, ముందు వైపు 5 మెగాపిక్స‌ల్ కెమెరాల‌ను అమ‌ర్చారు. వెనుక భాగంలో ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫోన్‌లో 4000 ఎంఏహెచ్ భారీ కెపాసిటీ క‌లిగిన బ్యాట‌రీని అందిస్తున్నారు.

Itel Vision 1 smart phone launched in India

ఐటెల్ విజ‌న్ 1 స్పెసిఫికేష‌న్లు…

* 6.088 ఇంచ్ హెచ్‌డీ ప్ల‌స్ డిస్‌ప్లే, 1560 x 720 పిక్స‌ల్స్ స్క్రీన్ రిజ‌ల్యూష‌న్‌
* 1.6 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెస‌ర్‌, 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్
* 128 జీబీ ఎక్స్‌పాండ‌బుల్ స్టోరేజ్‌, ఆండ్రాయిడ్ 9.0పై
* డ్యుయ‌ల్ సిమ్‌, 8, 5 మెగాపిక్స‌ల్ బ్యాక్‌, ఫ్రంట్ కెమెరాలు
* ఫింగ‌ర్ ప్రింట్ సెన్సార్‌, 4జీ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాట‌రీ

ఐటెల్ విజ‌న్ 1 గ్రీన్‌, బ్లూ క‌ల‌ర్ ఆప్ష‌న్ల‌లో విడుద‌ల కాగా.. ఈ ఫోన్ రూ.6,999 ధ‌ర‌కు వినియోగ‌దారుల‌కు ఆగ‌స్టు 18వ తేదీ నుంచి ల‌భ్యం కానుంది.

Read more RELATED
Recommended to you

Latest news